hyderabadupdates.com Gallery భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌

భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌

భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌ post thumbnail image

తిరుపతి : మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞానం, యోగ సాధనల సమన్వయంగా వెలుగొందిన మహనీయురాలని ప్రముఖ సాహితీవేత్త శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తికి అంకితమై, ఆత్మ సాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సాహితీ సదస్సులో పండితులు వెంగమాంబ జీవితం, సాహిత్య విశిష్టతపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.
ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యోగ జీవనం అనే అంశంపై శ్రీదేవి మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తూ నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆమె జీవితం భక్తి, తపస్సు, ఆత్మసాక్షాత్కారానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం సహాయాచార్యులు డా. సుభాషిని మాట్లాడుతూ వెంగమాంబ రచించిన “చెంచు నాటకం”లో స్త్రీ ఔనత్యం ప్రతిఫలిస్తుందని తెలిపారు. స్త్రీలోని ధైర్యం, స్వాభిమానం, సమానత్వ భావాలను వెంగమాంబ తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చారని చెప్పారు.
మనస్తత్వ పరిశోధకులు డా. బాలాజీ దీక్షితులు మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు భక్తి, భావోద్వేగం, ఆత్మానుభూతి సమన్వయంగా ఉండి భక్తిని పెంపొందిస్తాయని వివరించారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
The post భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ద‌ర‌ఖాస్తు చేసుకుంటే చాలు ఇల్లు ఇస్తాంద‌ర‌ఖాస్తు చేసుకుంటే చాలు ఇల్లు ఇస్తాం

హైద‌రాబాద్ : ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నాఅర్హత ఉంటే ఇల్లు

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భ‌ర్త మ‌హాశ‌యులుకు విజ్ఞ‌ప్తి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి.

జ‌ర్న‌లిస్టుల‌కు ఖుష్ క‌బ‌ర్ హెల్త్ స్కీం పొడిగింపుజ‌ర్న‌లిస్టుల‌కు ఖుష్ క‌బ‌ర్ హెల్త్ స్కీం పొడిగింపు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది జ‌ర్న‌లిస్టుల‌కు. ఆరోగ్య స్కీంకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు మీడియాలో ప‌ని చేస్తున్న వారంద‌రికీ గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్