hyderabadupdates.com Gallery భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు

భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు post thumbnail image

తిరుమ‌ల : ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేర‌కు స‌ద‌రు నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్ల‌డించింది టీటీడీ. ఇందులో భాగంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.
టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వ‌యంతో సోషియ‌ల్ మీడియాలో శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్న‌కేశ‌వులు అనే వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది టీటీడీ. ఇటీవ‌ల సోషియ‌ల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది.
ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే న‌మ్మ‌కూడ‌ద‌ని భ‌క్తుల‌ను కోర‌డ‌మైన‌ది. అలాంటి వ్య‌క్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెంః9866898630కు ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప‌లు సూచ‌న‌లు చేసింది శ్రీ‌వారి భ‌క్తుల‌కు. మోసం చేసే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. టీటీడీ ముంద‌స్తుగా అధికారికంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి , సేవ‌ల‌కు గాను ఒక నెల ముందుగానే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను మాత్ర‌మే వినియోగించాల‌ని కోరింది.
The post భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?బీఆర్ఎస్ దిమ్మెల‌ను కూల్చే ద‌మ్ముందా..?

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు , తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు ప‌ల్లె ర‌వికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి త‌ప్పిన మాట‌లు, సొల్లు క‌బుర్లు చెబుతూ తెలంగాణ‌పై నిత్యం విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని

చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవ‌రైనా స‌రే చైనాకు చెందిన మాంజాల‌ను వాడితే, లేదా ఉప‌యోగించినా కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎంసిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర