hyderabadupdates.com movies భయపెడుతున్న బాహుబలి బుకింగ్స్

భయపెడుతున్న బాహుబలి బుకింగ్స్

ఓవర్సీస్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్లు పూర్తయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ అనుభూతి తాలూకు పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఇవాళ రాత్రి నుంచి షోలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. రేపటికి కూడా పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. ఎన్నిసార్లు చూసి ఉన్నా ఇప్పుడీ ఎపిక్ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందన్న ఎన్ఆర్ఐ ఫీడ్ బ్యాక్ చూసి మళ్ళీ థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ రెడీ అవుతున్నారు. దీని దెబ్బకు కొత్త రిలీజ్ మాస్ జాతర వెనుకబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.

వీకెండ్ దాకా బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ ఇలాగే ఉండబోతున్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. అడ్వాన్స్ లోనే పది కోట్ల దాకా వసూలైనట్టు సమాచారం. ఇప్పటిదాకా నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ అంటూ రికార్డులన్నీ తన సినిమాల మీదే ఉండేలా చూసుకున్న రాజమౌళి ఇప్పుడీ రీ రిలీజ్ ద్వారా మరిన్ని మైలురాళ్లను సృష్టించబోతున్నారు. ఒకపక్క ఏపీ తెలంగాణను వర్షాలు ముంచెత్తినప్పటికీ క్రమంగా తెరిపినివ్వడంతో జనాలు మెల్లగా థియేటర్ల వైపు చూస్తున్నారు. వారాంతంలో వినోదం కావాలంటే పిల్లా పెద్దలతో సహా బాహుబలి ఎపిక్ కన్నా బెస్ట్ ఆప్షన్ లేదని ఫీలవుతున్నారు.

బయ్యర్లు అంచనా వేస్తున్నట్టు నిజంగా ఈ జోరు రోజుల తరబడి ఉంటే మాత్రం ఈ రికార్డులను మళ్ళీ టచ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టడం ఖాయం. ప్రభాస్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు కానీ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన బాహుబలిని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్న వైనం మాములుగా లేదు. జక్కన్న సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంటర్వ్యూలు, మేకింగ్ వీడియోలు, ప్రోమోలు, సోషల్ మీడియా పబ్లిసిటీ ఇవన్నీ దగ్గరుండి చూసుకోవడం బజ్ పెరగడానికి దోహదపడింది. ఎంతైనా రాజమౌళి, ప్రభాస్ ని చూస్తే సరిలేరు మీకెవ్వరూ అనిపిస్తుంది.

Related Post

జూబ్లీహిల్స్ పోరు: గెలిస్తే కాంగ్రెస్ రికార్డే!జూబ్లీహిల్స్ పోరు: గెలిస్తే కాంగ్రెస్ రికార్డే!

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విష‌యం తెలిసిం దే. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా.. దీనికి నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. ఇక‌, ఇప్పుడు దంగ‌ల్ య‌మ రేంజ్‌లో సాగ‌నుంది. ముఖ్యంగా అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన‌.. కాంగ్రెస్‌,