hyderabadupdates.com movies భారత్ కు భారీ షాక్.. ఆసుపత్రిలో అభిషేక్!

భారత్ కు భారీ షాక్.. ఆసుపత్రిలో అభిషేక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో బలంగా ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.

అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ శర్మ ఆరోగ్యం బాలేదని తెలుస్తోంది. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక్క బంతికే అవుట్ అవ్వగా, ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శామ్సన్ ఫీల్డింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అభిషేక్ రాలేదంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన జ్వరం కారణంగా సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు సమాచారం.

జట్టు అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ ఈ విషయంలో స్పందిస్తూ.. అభిషేక్ శర్మ ఇంకా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అయితే రేపు జరిగే మ్యాచ్ నాటికి కోలుకుంటారని ఆశిస్తున్నట్లు మీడియాకు చెప్పారు. మరోవైపు బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఫలితాలు వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా నమీబియా మ్యాచ్ లో అతని ఆడటం కష్టమేనని అనుకుంటున్నారు.

ఇదే సమయంలో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరడం భారత్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం. నమీబియా మ్యాచ్ కోసం అతని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలాగే కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్‌గా ఉన్నారని, ప్రాక్టీస్ సెషన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారని కోచ్ వివరించారు. ఇక అభిషేక్ శర్మ లేకపోవడం ఓపెనింగ్ విభాగంలో మళ్ళీ సంజూ శంసన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ అతను ఫామ్ లోలేకపోవడం కొంత రిస్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అభిషేక్ త్వరగా కోలుకోకపోతే, సూపర్ 8 మ్యాచ్‌ల నాటికి ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు చాలా ముఖ్యం. నమీబియా వంటి చిన్న జట్టుపై జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు చేసినా పర్లేదు కానీ, మెగా టోర్నీలో ఇలాంటి అనారోగ్య సమస్యలు జట్టును కలవరపెట్టేవే.

Related Post

ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారుఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మొత్తం 12 విభాగాలుగా విభజించి, వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో మంత్రులు,