hyderabadupdates.com Gallery భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం

భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం

భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం post thumbnail image

హైద‌రాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల‌ 19వ తేదీ నుంచి రెండు భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్‌లో తొలి ప్రదర్శనలుగా రెండు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అల్లు సినిమాస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. ఇందులో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా నిలుస్తోంది. ఆసియాలో అతిపెద్దదిగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా దీనికి గుర్తింపు ఉంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దారు. స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, ప్రతి దిశ నుంచి వచ్చే అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.
ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్‌ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు, జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్‌లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. ప్రొజెక్షన్ సిస్టమ్స్, సౌండ్ సెటప్, ఇతర సౌకర్యాలను పరిశీలించి, పబ్లిక్ ఓపెనింగ్‌కు అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది.
The post భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌ననారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌న

అమ‌రావ‌తి : దావోస్ లో ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇదేక్ర‌మంలో వ‌ర‌ల్డ్ లోనే

బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌వితబీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : స‌విత

విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు

CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌CP Sajjanar: వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా – సీపీ సజ్జనార్‌

CP Sajjanar : వ్యూస్‌ మాయలో పడి విలువలు మరిచిపోతే ఎలా అని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ (CP Sajjanar) ప్రశ్నించారు. వ్యూస్‌, లైక్స్‌తో సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన