hyderabadupdates.com movies భారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులు

భారీ సక్సెస్ లేకున్నా లైనప్ లో 11 మంది దర్శకులు

సూర్య నటన గురించి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కథలో దమ్ముంటే తను ఏ స్థాయిలో మెప్పిస్తాడో అందరికీ తెలిసిందే. కానీ బాక్సాఫీస్ దగ్గర అసలైన విజయం చూసి ఆయనకు చాలా కాలం అయ్యింది. 2013లో వచ్చిన ‘సింగం 2’ సినిమా తర్వాత ఇప్పటివరకు థియేటర్ల దగ్గర ఒక పక్కా కమర్షియల్ హిట్ అనేది పడలేదు. ఆ మధ్య వచ్చిన సూరరై పోట్రు, జై భీమ్ సినిమాలు మంచివే అయినా, అవి ఓటీటీకే పరిమితం అయ్యాయి. థియేటర్ల దగ్గర మాత్రం ఆయన మార్కెట్ కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది.

మరీ ముఖ్యంగా ‘కంగువ’ 1000 కోట్లు వసూలు చేస్తుందని అందరూ అనుకుంటే, తీరా చూస్తే అది దారుణంగా దెబ్బకొట్టింది. దాని తర్వాత వచ్చిన ‘రెట్రో’ కూడా అదే స్థాయిలో షాక్ ఇచ్చింది. మంచి నటుడు అనే పేరు ఉన్నా, థియేటర్లలో జనాలు ఎగబడి చూసే ఒక పెద్ద సినిమా పడకపోవడం సూర్యకు పెద్ద మైనస్ అయ్యింది. అయితే ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు ఏకంగా పది మందికి పైగా దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఈ జాబితాలో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఆర్‌జే బాలాజీ డైరెక్షన్‌లో వస్తున్న కరుప్పు సినిమాతో పాటు వెంకీ అట్లూరి, జీతూ మాధవన్ వంటి దర్శకులు ఇప్పుడు సూర్యను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, ఈసారి వైవిధ్యమైన కథలతో జనం ముందుకు రావాలని సూర్య ప్లాన్ చేశారు. ఈ లిస్టులో వెట్రిమారన్ తీయబోయే సినిమాతో పాటు పా. రంజిత్ ప్రాజెక్టుల మీద ఫ్యాన్స్‌కు గట్టి నమ్మకం ఉంది. 

వీరు సూర్యలోని నటుడిని వాడుకుంటూనే కమర్షియల్ గా సినిమాను ఎలా గట్టెక్కించాలో తెలిసిన వారు. అలాగే లోకేష్ కనగరాజ్ సృష్టించిన ‘రోలెక్స్’ పాత్రకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ ఒక్క క్యారెక్టర్ మీద సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ పాత రోజులు రావడం ఖాయం. చందూ మొండేటి లాంటి తెలుగు దర్శకులతో కూడా ఆయన చేతులు కలపడం విశేషం. ఇక లైనప్ లో జీతూ మాధవన్, మరీ సెల్వరాజ్, మన పరశురామ్, కన్నడ దర్శకుడు నర్థన్ కూడా ఉన్నారు.

వరుసగా ఫ్లాపులు వస్తున్నా సరే, పట్టువదలకుండా ఇన్ని సినిమాలు లైన్లో పెట్టడం ఆయన ధైర్యానికి నిదర్శనం. ఒక నటుడిగా ఆయనకు ఉన్న ఇమేజ్‌ని ఈ 12 మంది దర్శకులు ఎలా వాడుకుంటారో చూడాలి. ఈ సినిమాలన్నీ సక్రమంగా విడుదలయ్యి, అందులో కొన్ని విజయాలు సాధిస్తేనే సూర్య మళ్ళీ బాక్సాఫీస్ రేసులో నిలబడతారు. మరి ఈ దర్శకులైన ఆయనకు ఆశించిన విజయాన్ని అందిస్తారో లేదో వేచి చూడాలి.

Related Post

VD14: Ace cinematographer joins Vijay Deverakonda’s nextVD14: Ace cinematographer joins Vijay Deverakonda’s next

Tollywood star Vijay Deverakonda has joined forces with Rahul Sankrityan, the talented director behind Vijay’s Taxiwaala, for his next project. Tentatively titled VD14, the film was launched earlier this year.