hyderabadupdates.com Gallery భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి

భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి

భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భూ మాతను రక్షించ‌డంపై దృష్టి సారించాల‌ని , రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని స్ప‌ష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించు కోవచ్చని తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంద‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకం అని చెప్పారు. ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకు రావడం ద్వారా అటు రైతుకీ, ఇటు భూమికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకే పంటలో వివిధ రకాల జాతుల మొక్కలు అంతర పంటలుగా సాగు చేసే విధంగా రైతులను పోత్సహించాల‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా భూమికి చేవ పెరుగుతుందని అన్నారు.
The post భూ మాత‌ను ర‌క్షించాలి రైతుల ఆదాయం పెంచాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌Mumbai Hostage: పిల్లల నిర్బంధం ఘటనపై మరాఠీ నటి సంచలన పోస్ట్‌

Mumbai Hostage : మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని (Mumbai) ఓ యాక్టింగ్‌ స్టూడియోలో పట్టపగలే చిన్నారులను నిర్బంధించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా మరాఠీ నటి రుచితా విజయ్‌ జాదవ్‌ స్పందిస్తూ సంచలన విషయాలు

ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రుప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజ‌రు

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ శ‌నివారం మ‌రాఠా లోని బివాండి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని కోరుతూ కేసు దాఖ‌లు చేసింది రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్.

చంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాంచంద్ర‌గిరి మండ‌లాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా త‌న స్వంత ఊరు నారా వారి