hyderabadupdates.com movies మంచి ఆర్టిస్టు రిటైర్ అవుతున్నారు

మంచి ఆర్టిస్టు రిటైర్ అవుతున్నారు

క్యారెక్టర్ ఆర్టిస్టు తులసి గారు డిసెంబర్ 31 తర్వాత సినిమాలకు స్వస్తి చెబుతానని, ఇకపై నటించబోనని, సాయిబాబా సేవలో కాలం గడుపుతానని ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలే ఇప్పుడు నటీమణుల కొరత తీవ్రంగా ఉంది. యాక్టింగ్ చేయడం, చేయకపోవడం ఆవిడ వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ మరికొంత కాలం కొనసాగి ఉండాలని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే విడుదలైన లవ్ ఓటీపీ, కృష్ణలీలలో తులసి నటించారు. ఈవిడ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందో తెలియాలంటే తులసి నేపథ్యం అర్థం చేసుకోవాలి.

మూడు నెలల వయసప్పుడే 1967లో జీవన తరంగాలులో తులసి మొదటిసారి కనిపించారు. తరువాత ఆరేళ్ళ వయసొచ్చాక తమిళ సినిమా అరంగేట్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. చిల్లరకొట్టు చిట్టెమ్మతో తొలి అడుగు పడగా కె విశ్వనాథ్ వరసగా ఇచ్చిన రెండు అవకాశాలు సీతామాలక్ష్మి, శంకరాభరణం బాలనటిగా ఆమె కెరీర్ ని గొప్ప మలుపు తిప్పాయి. అక్కడి నుంచి చాలా హిట్ మూవీస్ చేశారు,. కోతల రాయుడు, న్యాయం కావాలి, ముద్దమందారం, రామదండు, త్రిశూలం, శుభలేఖ వగైరాలు మంచి పేరు తీసుకొచ్చాయి. చంద్రమోహన్ కాంబినేషన్ లో హీరోయిన్ గా నటించిన ముచ్చటగా ముగ్గురు లాంటి సక్సెస్ లు ఆ టైంలోనే దక్కాయి.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ కలిపి సుమారు మూడు వందలకు పైగా సినిమాలు చేసిన తులసి హీరో హీరోయిన్ల తల్లిగా వదినగా చాలా పాత్రలు చేసి ఇప్పటి ఆడియన్స్ కి దగ్గరయ్యారు తులసి భర్త కన్నడ దర్శకుడు శివమణి. ప్రస్తుతం జైలులో ఉన్న శాండల్ వుడ్ స్టార్ దర్శన్ కొత్త సినిమా డెవిల్ లోనూ తులసి ఉన్నారు. బహుశా రిటైర్మెంట్ కు ముందు ఇదే చివరి మూవీ కావొచ్చు. ప్రస్తుతం ఈవిడ వయసు 58. ఇంకా చురుకుగా ఉన్నప్పటికీ తన ఇష్టదైవం సేవలో మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న తులసి రెండుసార్లు నంది అవార్డు, ఒకసారి ఫిలిం ఫేర్ అందుకున్నారు.

Related Post

వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం: 441 కోట్ల ఆస్తులు అటాచ్‌!వైసీపీ మ‌ద్యం కుంభ‌కోణం: 441 కోట్ల ఆస్తులు అటాచ్‌!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు అంచ‌నావేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అరెస్టు చేసి విచారించారు. ఇంకా, విచారించాల్సిన వారి

OG Storm Rocks Telugu States with ₹200 Crore Blast — Pawan Kalyan Creates New Record!OG Storm Rocks Telugu States with ₹200 Crore Blast — Pawan Kalyan Creates New Record!

Power Star Pawan Kalyan’s latest action entertainer “They Call Him OG” continues to dominate Tollywood with massive box office numbers. Released amid sky-high expectations, the film made a thunderous start