hyderabadupdates.com movies మంత్రులు కావాల‌నుకున్నోళ్లు…

మంత్రులు కావాల‌నుకున్నోళ్లు…

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులు కావాల‌ని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ప‌నిచేయాలని చాలా మంది త‌ల‌పోశారు. గ‌త ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో చాలా మంది త‌మ‌కు సీటు ద‌క్కుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వారికి ఆశ‌లు ఫ‌లించ‌లేదు. కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజారుద్దీన్ కూడా ఉన్నారు.

అయితే..అప్ప‌ట్లో మంత్రులు కావాల‌ని అనుకున్న‌వారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. `విప్‌` ప‌ద‌వులు ఇచ్చి సంతోష పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఉగాది సంద‌ర్భంగా `విప్‌`ల జాబితాను ప్ర‌క‌టించారు. ఇటు అసెంబ్లీలోనూ.. అటు శాస‌న మండ‌లిలోనూ.. ప‌లువురు నాయ‌కుల‌కు విప్‌ల హోదా క‌ల్పించారు. వీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మండ‌లి స‌భ్యుల‌ను స‌మన్వ‌యం చేయ‌నున్నారు. త‌ద్వారా.. వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. `విప్‌`ల‌తో సంతృప్తి ప‌రిచారు.

అసెంబ్లీలో విప్‌లు వీరే..

+ వేముల వీరేశం: నకిరేకల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈయ‌న మంత్రి వ‌ర్గంలో చోటుకోసం శ‌త‌థా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ల‌భించ‌లేదు. చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా ఆయ‌న పేరు మంత్రి వ‌ర్గ జాబితాలో వినిపించింది.

+ విజయ రమణారావు: పెద్దపల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఈయ‌న మంత్రి వ‌ర్గ రేసులో లేక పోయినా.. ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు విప్‌తో ఆయ‌న‌ను సంతృప్తి ప‌రిచారు.

+ యెన్నం శ్రీనివాస్ రెడ్డి: మహబూబ్‌నగర్ నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. మంత్రి వ‌ర్గంలో చోటు ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేసుకున్నారు. కానీ.. ఆయ‌న పేరు ఈ జాబితాలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం విప్ ప‌ద‌వి వ‌రించింది.

శాసనమండలిలో

+ అద్దంకి దయాకర్: మంత్రివ‌ర్గ రేసులో ఆది నుంచి వినిపించిన నాయ‌కుల పేర్ల‌లో ద‌యాక‌ర్ పేరు ప్ర‌ముఖంగా ఉంది. కానీ, అవ‌కాశం చిక్క‌లేదు. తాజాగా మండ‌లిలో విప్ అయ్యారు.

+ బల్మూరి వెంకట్ : ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న వెంక‌ట్ పేరును కూడా మంత్రి వ‌ర్గం జాబితాలో చేర్చార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. ఈయ‌న పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఈ విష‌యాన్ని సీఎం రేవంత్‌ అప్ప‌ట్లోనే చెప్పారు. “బ‌ల్మూర‌న్న‌కు ఇంకా ఫ్యూచ‌ర్ ఉంది“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విప్‌ను చేశారు.

Related Post

Chiranjeevi Honours Padma Shri Winners Murali Mohan and Rajendra PrasadChiranjeevi Honours Padma Shri Winners Murali Mohan and Rajendra Prasad

Tollywood witnessed a proud and emotional moment on Republic Day as veteran actors Murali Mohan and Rajendra Prasad were honoured with the prestigious Padma Shri award. Adding more warmth to