hyderabadupdates.com Gallery మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు post thumbnail image

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాని మోదీకి, కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. శ‌నివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ నిధుల ద్వారా మ‌రింత అభివృద్ది చేసేందుకు దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా మ‌చిలీప‌ట్నం పోర్టును జాతీయ ర‌హ‌దారి నెట్ వ‌ర్క్ తో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో భాగంగా ఆరు లేన్ల ర‌హ‌దారి నిర్మించ‌నున్నారు. ఇందుకు గాను ఈ నిధుల‌ను ఉప‌యోగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు సీఎం.
కొత్త కారిడార్ కు సంబంధించి లోత‌ట్టు ప్రాంతాల‌ను ఓడ రేవుతో అనుసంధానం చేయ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తిదారుల‌కు లాజిస్టిక్స్ ఖ‌ర్చుల‌ను భారీగా త‌గ్గిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదే క్ర‌మంలో మెరుగైన ర‌హ‌దారి వ‌ల్ల మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు వీలు ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ఆర్థిక వృద్దిని పెంచేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు. దీని ద్వారా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు సీఎం. జాతీయ ర‌హ‌దారి 215 లోని మ‌చిలీప‌ట్నం బైపాస్ ద్వారా జాతీయ ర‌హ‌దారి 65 , ఎన్ హెచ్ 216 జంక్ష‌న్ ను మ‌చిలీప‌ట్నం పోర్టుకు అనుసంధానం చేస్తార‌ని తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని నిధుల‌ను మంజూరు చేస్తామ‌ని నితిన్ గ‌డ్క‌రీ హామీ ఇవ్వ‌డం ప‌ట్ల కృత‌జ్ఞత‌లు తెలిపారు.
The post మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు Deputy Speaker: డీజీపీకు డిప్యూటీ స్పీకర్ రఘురామ ఫిర్యాదు 

    కూటమి పక్షాల మధ్య, కులాల మద్య చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిపై డీజీపీకి పిర్యాదు చేశారు. అంభోజి వినయ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో కరుడుగట్టిన

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని

తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాంతెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాము ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతామ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె పునరుద్ఘాటించారు .