hyderabadupdates.com movies మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మణిరత్నం సినిమాల్లో హిట్లు ఉండొచ్చు, ఫ్లాపులు ఉండొచ్చు. కానీ ఎందులో అయినా నటీనటుల అభినయం మాత్రం అద్భుతంగా ఉంటుంది.

‘అంజలి’ సినిమాలో చిన్న పిల్లల నుంచి కూడా అద్భుతమైన హావభావాలు రాబట్టుకున్న నైపుణ్యం మణిరత్నంది. చివరగా ‘థగ్ లైఫ్’ మూవీతో తీవ్రంగా నిరాశపరిచిన మణిరత్నం.. ఇప్పుడు తనదైన శైలిలో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీయడానికి రెడీ అవుతున్నారు. అందులో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేస్తున్న విషయం ఇప్పటికే ఖరారైంది. 

తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించనుందట. లీడ్ పెయిర్ ఖరారైపోయినట్లు చెన్నై వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవికి ఎవరికి వారు ఎంత మంచి పెర్ఫామర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అద్భుత అభినయానికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి.

ఇలాంటి నటీనటులు మణిరత్నం చేతిలో పడితే.. వారి పెర్ఫామెన్స్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందనడంలో సందేహం లేదు. సేతుపతి ఇప్పటికే మణిరత్నం సినిమా ‘నవాబ్’లో నటించాడు. అందులో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సాయిపల్లవి తొలిసారి మణి దర్శకత్వంలో నటించబోతోంది.

చిన్న చిన్న దర్శకుల సినిమాల్లోనే సాయిపల్లవి పెర్ఫామెన్స్ అదరగొట్టేసింది. అలాంటిది మణిరత్నం సినిమాలో అంటే ఆమెకు నటన పరంగా కెరీర్ బెస్ట్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు సమాచారం. 

Related Post

ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్

ఏపీ లోని ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ముందడుగు వేస్తోంద‌న్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌.. మాట్లాడుతూ.. ఏపీలో గూగుల్ డేటా కేంద్రం,

పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటిపుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ