hyderabadupdates.com Gallery మత్స్యకారుల క‌డుపు కొట్టిన వైఎస్ జ‌గ‌న్

మత్స్యకారుల క‌డుపు కొట్టిన వైఎస్ జ‌గ‌న్

మత్స్యకారుల క‌డుపు కొట్టిన వైఎస్ జ‌గ‌న్ post thumbnail image

అమ‌రావ‌తి : మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం నిజంగా పని చేసింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మత్స్యకారులను మాటలతో మభ్యపెట్టి వారి హక్కులను కాలరాసింది జగన్ ప్రభుత్వం అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.జువ్వ‌ల‌దిన్నె హ‌ర్బ‌ర్ వ‌ద్ద నిస్సిగ్గుగా జ‌గ‌న్ ప‌చ్చి అబద్దాలు మాట్లాడారంటూ మండిప‌డ్డారు మంత్రి . ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గ‌త ప్ర‌భుత్వంలో కేంద్రం వాటా అయిన 128 కోట్ల‌ను ఉప‌యోగించ‌కుండా నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోపించారు. రాష్ట్ర వాటా కూడా మ‌త్స్య‌కారుల కోసం ఉప‌యోగించ‌కుండా ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కేంద్రం వాటా నిధుల‌ను వెంట‌నే క‌ట్టాల‌ని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింద‌ని, లేక‌పోతే ఇత‌ర స‌బ్సిడీలు అమ‌లు చేసేది లేదంటూ చెప్ప‌టంతో వెంట‌నే 128 కోట్ల బ‌కాయిల‌ను విడుద‌ల చేశామ‌న్నారు అచ్చెన్నాయుడు.
ఇవాళ జ‌గ‌న్ నోటికి వ‌చ్చిన అబ‌ద్ధాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని అన్నారు. వేట నిషేధ కాలంలో ఇచ్చే భృతిని రూ.10,000 నుండి రూ.20,000కు పెంచి, లక్షలాది కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు. ఒకే సంవత్సరంలో భారీగా రూ.242 కోట్లకు పైగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు డీజిల్ సబ్సిడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వేలాది పడవలకు లీటరుకు రూ.9 సబ్సిడీ అందిస్తున్నామని వెల్ల‌డించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చిన సబ్సిడీ కంటే మెరుగైన సహాయం తాము అందిస్తున్నామని పేర్కొన్నారు.
The post మత్స్యకారుల క‌డుపు కొట్టిన వైఎస్ జ‌గ‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పేద‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం : సీఎంపేద‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం : సీఎం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని చేపట్టామ‌న్నారు. ఉద్యోగులంతా ఈ 99 రోజుల కార్యాచరణను ఒక దీక్షలా చేస్తే

రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

హైద‌రాబాద్ : మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ నిర్మాత‌, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిద‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి

సింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసంసింగ‌ర్ మంగ్లీ నిర్వాకం రూ. 10 కోట్ల మోసం

హైద‌రాబాద్ : సింగ‌ర్ గా పేరు పొందిన మంగ్లీ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారారు. గ‌తంలో త‌ను డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు తాజాగా ఏకంగా రూ. 10 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మంగ్లీపై హైద‌రాబాద్