hyderabadupdates.com Gallery మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి

మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి

మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి post thumbnail image

అమ‌రావ‌తి : మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రిని క‌లిశారు. త‌మ‌ను ఎంపిక చేసినందుకు వారు మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, సహకార సంఘాల ద్వారా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు అచ్చెన్నాయుడు. నూతన కమిటీ సమన్వయంతో, అంకితభావంతో పనిచేస్తే మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకు రావచ్చని అన్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో త‌మ స‌ర్కార్ రైతుల ప్ర‌యోజనాలు కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తంద‌న్నారు. మిర్చి మార్కెట్ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు ఏర్పాటు, మరుగుదొడ్లు శుభ్ర ప‌ర‌చ‌టం, విశ్రాంతి కొర‌కు బెడ్ షీట్స్ ఏర్పాటు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను మొరు గుప‌ర‌చ‌డం, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
ఈ సారి సీజ‌న్ ముందుగా రావ‌డం వ‌ల‌న రైతుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మం ముంద‌స్తుగానే మొద‌లు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెట్ లో ఉన్న పోటీ ధరలు చెల్లించాలని రవాణా సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. ఆకస్మిక వర్షాలు కురిస్తే మార్కెట్ యార్డులో ఉన్న బస్తాలు తడిసి పోతున్నాయని ఇందుకు ప్ర‌త్యాహ్న‌య ఏర్పాట్ల‌ను చేయాల‌ని అన్నారు. రైతుల‌కు మేలు చేసేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ఎప్పుడు సిధ్దంగా ఉంటుందని, రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి అచ్చెన్నాయుడు హ‌మీ ఇచ్చారు.
The post మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలుSabarimala Gold: శబరిమల బంగారు తాపడాల బరువులో తగ్గుదలలో ఆశక్తికర విషయాలు

Sabarimala : శబరిమల ఆలయంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గడంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో (Kerala High Court) విచారణ జరుగుతుంది. బంగారు తాపడాల విషయంలో అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలిగోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా

తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేంతెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేం

న్యూఢిల్లీ : వివాదాస్పద హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కు ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై స‌వాల్ చేస్తూ తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. శుక్ర‌వారం