hyderabadupdates.com movies మన ఆకలిని మనకంటే ముందే తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది

మన ఆకలిని మనకంటే ముందే తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది

మన ఆకలిని మనకంటే ముందే తెలుసుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది post thumbnail image

ఎవరి ఆకలి వారికే తెలుస్తుంది.. అడగందే అమ్మైనా పెట్టదనే సామెత కూడా ఉంది. కానీ ఈ పరికరానికి మన ఆకలి తెలుస్తుంది. అంతేకాదు.. ఏకంగా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తుంది. మంగుళూరు కు చెందిన యువకుడు తయారుచేసిన డివైస్ మన కడుపులోని ఆకలి కేకలను కూడా పసికడుతుంది. మనకు ఎంత ఆహారం కావాలో కూడా అదే డిసైడ్ చేసుకుని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ చేస్తుంది.

నూతన పరిశోధనల ద్వారా సరికొత్త ఆవిష్కరణలతో మన దేశ యువత దూసుకు వెళుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీని అందుకుని కొత్త పరికరాలను రూపొందిస్తుంది. అటువంటిదే ఈ మంగుళూరు కు చెందిన యువకుడి ఆవిష్కరణ. 

మంగళూరు ప్రాంతానికి చెందిన యువకుడు సోహన్ ఎం రాయ్ రూపొందించిన ఈ ఏఐ పరికరం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కడుపు ఖాళీ అయితే వెంటనే భోజనాన్ని ఆర్డర్ చేసే ఈ పరికరాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోహన్ తయారు చేసిన ఈ పరికరం కడుపు శబ్దాలను గుర్తించి, వెంటనే ఆ శబ్దాన్ని ఆకలిగా భావించి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ వేస్తుంది.

కడుపు శబ్దాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషిస్తుంది. ఆ వెంటనే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై పలు కామెంట్లు చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి రోజు మొత్తం ఆకలితో కూర్చున్నాడట… అదేనండి అసలు ఇన్నోవేషన్! అని ఒకరు కామెంట్ చేశారు.

A Mangaluru man builds AI powered device that orders food automatically when his stomach growls. pic.twitter.com/Dx7aT9yFEs— Indian Tech & Infra (@IndianTechGuide) November 28, 2025

Related Post

టాలీవుడ్ హీరోయిన్స్… ఈ అమ్మాయితో జాగ్రత్తటాలీవుడ్ హీరోయిన్స్… ఈ అమ్మాయితో జాగ్రత్త

అనస్వర రాజన్.. మలయాళ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సినిమాలు ఒకట్రెండు చూసి ఉన్నా.. తనెంత టాలెంటెడో అర్థమైపోతుంది. టీనేజీలోనే నటిగా గొప్ప పేరు సంపాదించిందీ అమ్మాయి. ముఖ్యంగా లెజెండరీ నటుడు మోహన్ లాల్‌తో కలిసి

Kodali Nani Steps Out After 18-Month Silence, Returns to Gudivada PoliticsKodali Nani Steps Out After 18-Month Silence, Returns to Gudivada Politics

Former minister Kodali Nani has finally stepped back into the public eye after an eighteen-month absence. His defeat in the 2024 elections pushed him away from Gudivada, and health problems