hyderabadupdates.com Gallery మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మూవీ అదుర్స్

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మూవీ అదుర్స్

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మూవీ అదుర్స్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌రణ పొందిన ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు అనిల్ రావిపూడి. త‌ను వ‌రుస‌గా మ‌రో హిట్ అందించాడు. గ‌త ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్, చాందిని చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ఏడాది 2026లో సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇప్ప‌టికే మ్యూజిక్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, న‌య‌నతార కీ రోల్ పోషించారు. ప్ర‌మోష‌న్స్ కూడా అదిరాయి. పాజిటివ్ టాక్ రావ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆనందం వ్య‌క్తం అవుతోంది. ప్రధానంగా గ‌త కొంత కాలంగా మెగాస్టార్ కు ఆశించిన బిగ్ హిట్ రాలేదు.
ఈ త‌రుణంలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా రిలీజ్ అయిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ చిత్రం దుమ్ము రేపుతోంది. వ‌సూళ్ల ప‌రంగా దూసుకు పోతోంది. కేథ‌రిన్ త్రెసా, వీటీవీ గ‌ణేష్ కూడా ముఖ్య పాత్ర‌ల‌లో జీవించారు. ఇక భీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక పాట‌లు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదే సమ‌యంలో ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్, వెంకీ మామ క‌లిసి చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి అంటేనే మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఫుల్ న‌మ్మ‌కం పెట్టుకున్నాడు మెగాస్టార్.
The post మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మూవీ అదుర్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసిచరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ

Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !

    కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్‌ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో

బీసీసీఐతో గూగుల్ ఏఐ రూ. 270 కోట్ల ఒప్పందంబీసీసీఐతో గూగుల్ ఏఐ రూ. 270 కోట్ల ఒప్పందం

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) తో భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. రూ. 270 కోట్లు బీసీసీఐకి ఇవ్వ‌నుంది. మూడు సంవ‌త్స‌రాల పాటు ఈ అగ్రిమెంట్ కొన‌సాగ‌నుంది.