మయన్మార్ (బర్మా) : ఆంగ్ సాన్ సూకీ నిర్భంధం తర్వాత మయన్మార్ ఒకనాటి బర్మా దేశం పగ్గాలు నియంతగా పేరు పొందిన, ఆ దేశ ఆర్మీ చీఫ్ మిన్ ఆంగ్ హైంగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యక్ష ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన లెక్కింపులో మిన్ ఆంగ్ హ్లైంగ్ గెలుపునకు అవసరమైన కనీస ఓట్లను దాటినట్లు ప్రకటించారు. తను సైనిక అనుకూల పార్లమెంట్ ద్వారా ఎన్నిక కావడం చర్చకు దారి తీసింది. అనుభవజ్ఞుడైన ఈ జనరల్ సైనిక పాలకుడిగా తన పదవికి రాజీనామా చేశారు. మరో వైపు తన ఎన్నిక పూర్తిగా అప్రజాస్వామికమని అక్కడి ప్రజాస్వామిక వాదులు ఆందోళన చేపట్టారు.
సైనిక పాలనను పటిష్టం చేయడానికి జరిగిన బూటకమని ఇటీవలి ఎన్నికలపై విమర్శలు వెల్లువెత్తాయి .పౌర ముసుగులో మిన్ ఆంగ్ హ్లైంగ్ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన ఐదేళ్ల తర్వాత, యుద్ధంతో దెబ్బతిన్న ఈ దేశంలో రాజకీయ అధికారంపై తన పట్టును అధికారికం చేసుకుంటూ, మయన్మార్ సైనిక పాలకుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ శుక్రవారం పార్లమెంటరీ ఓటు ద్వారా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 69 ఏళ్ల జనరల్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ పరిపాలనకు వ్యతిరేకంగా 2021లో ఒక తిరుగుబాటును నడిపించి, ఆమెను అరెస్టు చేశారు. ఇది విస్తృత నిరసనలకు దారితీసి, సైనిక పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సాయుధ ప్రతిఘటనగా రూపాంతరం చెందింది.
The post మయన్మార్ అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మయన్మార్ అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ ఎన్నిక
Categories: