hyderabadupdates.com Gallery మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు post thumbnail image

తిరుపతి : టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసి అఫిడవిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా కె. ఇందిర మాట్లాడుతూ గత నవంబర్ 15వ తేదీన తన భర్త డా. కె. శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థివ దేహం మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త కోరిక మేరకు తాను చనిపోయాక తన పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించిన అఫిడవిట్ ను టిటిడి ఈవోకు అందజేశారు.
కె. ఇందిర నిర్ణయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా కె. ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈవో పంపించారు. గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యా భర్తలిద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించారు. ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతో పాటు కొంత మందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు.
The post మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి టైమ్‌లో అనేక సినిమాలతో పోటీగా విడుదల కావడం ఈ