hyderabadupdates.com movies మళ్ళీ రాజశేఖరుడితో రమ్యకృష్ణ

మళ్ళీ రాజశేఖరుడితో రమ్యకృష్ణ

90వ దశకంలో అప్పటి తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన సినిమా.. అల్లరి ప్రియుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణల మధ్య కెమిస్ట్రీ.. వారి మధ్య వచ్చిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి దీర్ఘ సుమంగళీభవ, బలరామకృష్ణులు తదితర చిత్రాల్లో నటించారు.

ఐతే 1998 తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఐతే సుదీర్ఘ విరామానంతరం ఈ జోడీని తెరపై చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు. కొంచెం గ్యాప్ తర్వాత రాజశేఖర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించనుందట. తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే ‘లబ్బర్ పందు’లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేయబోతున్నారట. పిట్టగోడ, 35 చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడు. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. తమిళంలో శ్వాసిక చేసిన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.

రాజశేఖర్ చివరి చిత్రం ‘శేఖర్‌’ను డైరెక్ట్ చేసిన ఆయన భార్య జీవితనే ఈ బాధ్యతలు అందుకుంటుందేమో చూడాలి. ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలతో ఆయన చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటి చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఈ అనుభవాల తర్వాత కూడా ఆయన మళ్లీ రీమేక్ రిస్క్‌కు రెడీ అవుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related Post

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. మహానుభావుడు, ఎఫ్-2 లాంటి హిట్లూ పడ్డాయి. కానీ ఒక దశ దాటాక వరుస ఫ్లాపులు రావడంతో ఆమె

Antony Varghese Pepe X Keerthy Suresh movie officially titled Thottam, teaser OUTAntony Varghese Pepe X Keerthy Suresh movie officially titled Thottam, teaser OUT

The teaser features an intense, animated glimpse of Antony Varghese Pepe and Keerthy Suresh. With the movie expected to be a complete action entertainer, the word “Demesne” itself refers to