hyderabadupdates.com movies మళ్ళీ సున్నా నుంచి జన నాయకుడి జర్నీ

మళ్ళీ సున్నా నుంచి జన నాయకుడి జర్నీ

సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు నిన్నా మొన్నటి దాకా తెగ ఖంగారు పడ్డారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోవడంతో దాన్ని మర్చిపోయి టీవీకే పార్టీ కోసం ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు. హీరో విజయ్ ఎలెక్షన్ క్యాంపైన్లు, ఎంక్వయిరీలు, పిటీషన్లు అంటూ క్షణం ఊపిరి సలపకుండా తిరుగుతున్నాడు. అందుకే సినిమా సైలెంట్ అయ్యింది.

ఓటిటి డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వెనక్కు తగ్గిందనే వార్త వచ్చాక ఒక్కసారిగా జన నాయకుడి మీద బజ్ ఇంకా తగ్గిపోయింది. ముందు అనుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సైతం చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు కొత్త పంపిణీదారుడు కోసం వెతుక్కోవాలి. ఇదంతా టైం పట్టే ప్రాసెస్. ఈలోగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన కేడి ది డెవిల్, టాక్సిక్ విడుదలైపోతాయి కాబట్టి ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. తర్వాత జన నాయకుడు సెన్సార్ వ్యవహారాలు చూస్తారు.

ఈ లెక్కన జన నాయకుడు జూలై కన్నా ముందు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ చివర్లో కేడి డెవిల్, జూన్ మొదటివారంలో టాక్సిక్ ఆల్రెడీ అఫీషియల్ గా ఫిక్స్ చేశారు. సో విజయ్ సినిమా ఆపై నెలలోనే రావాలి. అప్పటికంతా ఎన్నికల ఫలితాలు వచ్చేసి ఉంటాయి. విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడా, జన నాయకుడుకి భీభత్సమైన అడ్వాంటేజ్ ఉంటుంది. వసూళ్ల వరద పారి అంచనాలకు అందని కలెక్షన్లు వస్తాయి.

లేదూ ఓడిపోయాడా ఫ్యాన్స్ తిరిగి జై విజయ్ అంటూ థియేటర్లకు పరిగెడతారు. కాకపోతే పొలిటికల్ లీడర్ గా విజయ్ చేసుకున్న డ్యామేజ్ ఏదైనా ఉంటే మటుకు అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న స్టాలిన్ సర్కారే మళ్ళీ వస్తే మటుకు విడుదల ఆగదు కానీ ఎంతో కొంత నెగటివ్ ఎఫెక్ట్ జన నాయకుడు మీద ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సున్నా నుంచి ప్రయాణం మొదలుపెట్టాల్సిన జన నాయకుడు చివరికి ఏం చేస్తాడో.

Related Post

“Dhandoraa Promises a Stirring, Thought-Provoking Rural Drama”: Director Murali Kanth“Dhandoraa Promises a Stirring, Thought-Provoking Rural Drama”: Director Murali Kanth

After delivering distinctive films like Colour Photo and the blockbuster Bedurulanka 2012, Loukya Entertainments head Ravindra Banerjee Muppaneni is set to return with his new production Dhandoraa, a rooted rural