హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మహమ్మద్ అజారుద్దీన్ కు ఉన్నట్టుండి కొత్త ఏడాది కలిసి వచ్చింది. ఆయన గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడి పోయారు. ఇక్కడ ఎమ్మెల్యే గా ఉన్న గాంధీ అనారోగ్యంతో మృతి చెందడంతో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ట్రై చేశారు. చివరకు ఏమైందో ఏమో కానీ హైకమాండ్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చింది. అంతే కాదు ఎవరూ ఊహించని రీతిలో తనను మలివిడత కేబినెట్ లోకి మంత్రిగా తీసుకుంది. కీలకమైన శాఖలను అప్పగించింది అజారుద్దీన్ కు .ప్రధానంగా అత్యధికంగా జనాభా కలిగిన మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ అంతటా పెరిగింది.
ఈ తరుణంలో అనూహ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఇంట్లో విభేదాల కారణంగా బయటకు వచ్చారు. వారితో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. తాను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ఉన్నారు. జనం బాట పేరుతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. చివరకు తాను బీఆర్ఎస్ నుంచి వదిలేసి రావడంతో ఇక ఆ పార్టీ నుంచి వచ్చిన పదవి తనకు అక్కర్లేదని భావించారు. ఈమేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తాను రాజీనామా చేసిన లేఖను సమర్పించింది. చివరకు తను తాత్సారం చేయడంతో తిరిగి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరింది. ఆయన ఓకే చెప్పడంతో త్వరలోనే ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక జరగనుంది. దీంతో అజ్జూకి లైన్ క్లియర్ అయ్యింది.
The post మహమ్మద్ అజారుద్దీన్ కు లైన్ క్లియర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మహమ్మద్ అజారుద్దీన్ కు లైన్ క్లియర్
Categories: