hyderabadupdates.com Gallery మ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండి

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండి

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండి post thumbnail image

అమ‌రావ‌తి : మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’‌కు పార్లమెంట్‌లో మద్దతుపై రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకు వస్తున్న చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని కోరారు. జనసేన అధ్యక్షులు కె పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖలు రాశారు.
మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టమ‌ని పేర్కొన్నారు సీఎం. మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదప డుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని స్ప‌ష్టం చేశారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదాం అని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ అమ‌లుకు బాట‌లువేసే ‘నారీ శక్తి వందన్ అధినియం’ స‌వ‌ర‌ణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల‌ ముందుకు రానుండ‌టంతో దశాబ్దాల కల నిజం అవుతోంద‌ని పేర్కొన్నారు సీఎం. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలా, సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగుగా అభివ‌ర్ణించారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post మ‌హిళా రిజ‌ర్వేష‌న్ నారీ శ‌క్తి వంద‌న్ కు మ‌ద్ద‌తివ్వండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడుCM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

    బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీCM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

Mamata Banerjee : ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జల్‌పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోమవారం పర్యవేక్షించారు.

తిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభంతిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభం

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో