అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా బాలికలు, యువతులు, మహిళల గురించి ప్రస్తావించారు. వారు లేకపోతే ఈ సమాజం మనుగడ సాధించదని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. శనివారం సీఎం మీడియాతో మాట్లాడారు. బాలికలకు సాధికారత కల్పించి, రక్షించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు సాధికారత కల్పించే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రజలు తమను తాము పునరంకితం చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం అని ముఖ్యమంత్రి అన్నారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం నిజమైన పురోగతిని సాధిస్తుందని ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు సాధికారత కల్పించి, రక్షించి, విజయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఒక సమాజం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించి, దేశ నిర్మాణంలో చురుకైన భాగస్వామ్యం వహించేలా వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా మహిళలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. తమ సర్కార్ ఏపీలో కొలువు తీరిన తర్వాత దేశంలో ఎక్కడా లేని రీతిలో బాలికలు, యువతులు, మహిళల సంక్షేమం , సాధికారత దిశగా అడుగులు వేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
The post మహిళా సాధికారతతోనే సమాజం పురోగతి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మహిళా సాధికారతతోనే సమాజం పురోగతి
Categories: