hyderabadupdates.com movies మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండాలనే విషయంలో చాలా పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

​రాజమౌళి సృష్టించే ఆ భారీ ఎత్తును అందుకోవాలంటే నేటి తరం దర్శకుల్లో సందీప్ వంగానే బెస్ట్ ఆప్షన్ అనే చర్చ నడుస్తోంది. రాజమౌళి స్వయంగా వంగా మేకింగ్ స్టైల్‌ను ఇష్టపడతారని చాలా సందర్భాల్లో చెప్పారు. కమర్షియల్ హంగులతో పాటు ఇంటెన్సిటీని చూపించడంలో వంగాకి ఒక సెపరేట్ రూట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఆ ‘హై’ ని కొనసాగించాలంటే వంగా లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు తిరగరాయచ్చనేది ఫ్యాన్స్ మాట.

​అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. సందీప్ వంగా తన పాత కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా లైన్ లో ఉంది. కాబట్టి మహేష్ బాబు వంగా కాంబినేషన్ కు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు.

​మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి చేసుకుని 2027 లో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా అదే టైమ్‌కి వంగా కూడా తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ జతకట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ రాజమౌళి తర్వాత మహేష్ మరో ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తే, ఆ రేంజ్ ని తట్టుకునే దర్శకుడు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజమౌళి సినిమాతో వచ్చే పాన్ ఇండియా క్రేజ్‌ను కాపాడుకోవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి.

Related Post

ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు: లోకేష్‌

క‌ర్నూలులో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆద్యంత

స్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లోస్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లో

నిఖిల్ హీరోగా రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ విడుదల