hyderabadupdates.com movies మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు కొత్త‌వారు క‌నిపిస్తున్నా.. దాదాపు 60-70 శాతం మంది ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి రేసులో స్టాలిన్‌కే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. గ‌త 2024 ఎన్నిక‌ల్లో ఏపీలోనూ ముఖ్య మంత్రిగా చంద్ర‌బాబుకు 70 శాతం మంది ప్ర‌జ‌లు మొగ్గు చూపిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులపై కంటే కూడా ముఖ్య‌మంత్రి అయ్యేవారిపైనే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఫోక‌స్ పెంచారు.

రీజ‌నేంటి?

ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. అప్ప‌ట్లో పెట్టుబ‌డులు,ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌, సంప‌ద సృష్టి వంటివి ప్ర‌భావంగా ప‌నిచేశాయి. దీనికితోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జోడీ క‌ట్ట‌డం.. కూడా బాబుకు క‌లిసి వ‌చ్చింది. దీనిని మెజారిటీ ప్ర‌జ‌లు హ‌ర్షించారు. బాబు అనుభ‌వాన్ని కూడా.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. అలానే.. ఏపీ అస్తిత్వానికి కీల‌క‌మైన‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం బాబుతోనే సాధ్య‌మ‌ని భావించారు. మొత్తంగా.. ఇవి అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించాయి.

త‌మిళ‌నాడు విష‌యంలోనూ ఇప్పుడు ఇదే ప్ర‌భావం క‌నిపిస్తోంది. వాస్త‌వానికి త‌మిళ‌నాడులో ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి పాల‌న మారుతుంది. పార్టీల‌ను అధికారంలోకి మార్చేయ‌డం ఇక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న ప్ర‌యోగం. అయితే.. గ‌తంలో అన్నాడీఎంకేకు రెండుసార్లు వ‌రుస‌గా అవ‌కాశం ఇచ్చారు. కానీ, ఈ ద‌ఫా సీఎం స్టాలిన్‌కే మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఏపీలో ఉన్న అనుభ‌వాలు ఇక్క‌డ కూడా ప‌నిచేస్తున్నాయ‌ని తాజాగా స‌ర్వేలు చెబుతున్నారు.

ఇవీ రిజ‌న్లు..1) అనుభ‌వానికి పెద్ద‌పీట‌: స్టాలిన్ అయితే.. నిక‌రంగా పాల‌న అందిస్తార‌న్న భావ‌న ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దీంతో 62 శాతం మంది ఆయ‌న‌ను మ‌రోసారి సీఎంగా చూడాల‌ని కోరుకుంటున్నారు.

2) తమిళ‌నాడు అస్తిత్వం: దీని కోసం.. ఆయ‌న చేసిన పోరాటాల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌వ‌ర్న‌ర్(నిన్న‌మొన్న‌టి దాకా ఉన్న ర‌వి)తో ఆయ‌న అలుపెరుగ‌ని పోరాటం చేశార‌న్న భావ‌న కూడా ప్ర‌జ‌ల్లో ఉంది.

3) సంక్షేమ ప‌థ‌కాలు: గతంలో ఉన్న‌ట్టుగానే ఇప్పుడు కూడా సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్నారు. మ‌రిన్ని పొడిగించేందుకు విస్తరించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యారు. ఇప్పటికే మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.5000 చొప్పున వేశారు.

4) విజ‌య్ కు కూడా మొగ్గు: విజ‌య్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని అనుకున్న వారిలో 20 శాతం నుంచి 30 శాతం యువ‌త ఉంది.

5) విజ‌య్‌కు వ్య‌తిరేక‌త‌: క‌రూర్ తొక్కిస‌లాట‌, వివాహేత‌ర సంబంధం వంటి విష‌యాల‌తో విజ‌య్‌పై వ్య‌తిరేకత వ‌స్తుంద‌ని అంచనా ఉన్నా.. అదేమీ లేద‌ని తేలిపోయింది. కానీ, అనుభ‌వం పైనే విజ‌య‌కు స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయి.

6) ప‌ళ‌ని స్వామి+ ప‌న్నీర్‌సెల్వం: ఇరువురు మాజీ ముఖ్య‌మంత్రులు. కానీ, ప్ర‌జ‌లు ప‌ళ‌ని స్వామి వైపు 10 శాతం మంది ఉండ‌గా.. ప‌న్నీర్ సెల్వం వైపు కేవ‌లం 5-6 శాతం మంది మాత్ర‌మే ఉన్నారు. వారిని షాడో ముఖ్య‌మంత్రులుగానే భావిస్తున్నార‌న్న‌ది స‌ర్వేలు చెబుతున్న మాట‌.

7) శ‌శిక‌ళ‌: జ‌య‌ల‌లిత నెచ్చెలి.. తాజాగా కొత్త పార్టీ పెట్టుకు శ‌శిక‌ళ‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఆమెకు.. 0-3 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తోనే స్టాలిన్‌కు తిరుగులేద‌న్న మాట వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related Post

Top 9 South Films Releasing in January 2026: Thalapathy Vijay’s Jana Nayagan to Prabhas’ The Raja SaabTop 9 South Films Releasing in January 2026: Thalapathy Vijay’s Jana Nayagan to Prabhas’ The Raja Saab

Cast: Prabhas, Sanjay Dutt, Malavika Mohanan, Nidhhi Agerwal, Riddhi Kumar, Boman Irani, Zarina Wahab, Samuthirakani, Vennela Kishore Director: Maruthi Language: Telugu Genre: Romantic Fantasy Horror Comedy Release Date: January 9,