hyderabadupdates.com movies మాట తప్పే సమస్యే లేదంటున్న పెద్ది

మాట తప్పే సమస్యే లేదంటున్న పెద్ది

ఇంకో నలభై రోజుల్లో పెద్ది వచ్చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు పిడుగు లాంటి వార్త వచ్చేలా ఉందనే టాక్ సోషల్ మీడియాని ఊపేస్తోంది . మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్ట్రాంగ్ కంటెంట్ ని దర్శకుడు బుచ్చిబాబు నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30 విడుదల తేదీ వాయిదా పడి మే లేదా జూన్ కు వెళ్లొచ్చనే పుకారు నిమిషాల వ్యవధిలో రెక్కలు కట్టుకుని ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో తెగ తిరిగేస్తోంది.

వాస్తవం ఏంటంటే ఏప్రిల్ 30 ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేందుకు పెద్ది బృందం రెడీగా లేదు. బ్యాలన్స్ షూటింగ్ డే అండ్ నైట్ చేస్తున్నారు. స్పెషల్ సాంగ్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఇంకొక్క వారంలో చరణ్ తో ఆడిపాడే భామలు ఎవరో ఫిక్స్ అయిపోతుంది. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ మీద జరుగుతున్నాయి. ఇంకోవైపు రీ రికార్డింగ్ కు ఏఆర్ రెహమాన్ రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయ్యిందట. రంజాన్ కాగానే పోస్ట్ ఇంటర్వెల్ మొదలుపెడతారు.

సో పెద్ది ఏప్రిల్ 30 రావడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇదే సమాచారం ఉంది. ఓవర్ సీస్ బుకింగ్స్ చరణ్ బర్త్ డే నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. నెల ముందే టికెట్ల అమ్మకాలంటే పెద్ద నెంబర్లు చూడొచ్చు. ప్లానింగ్ లో ఎలాంటి తేడా రాదని యూనిట్ టాక్. పెద్దిలో నిర్మాణ భాగస్వామ్యం ఉన్న మైత్రి మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం ఉండటం వల్ల టార్గెట్ మిస్ అవ్వడంలో ఎలాంటి మార్పు ఉండదు.

బిజినెస్ పరంగా పెద్ది మీద మాములు అంచనాలు లేవు. పుష్ప టైంలో చూసిన యూఫోరియా మళ్ళీ దీనికే కనిపిస్తుందని బయ్యర్లు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టే డిస్ట్రిబ్యూషన్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే అయినా బుచ్చిబాబు, రామ్ చరణ్ దాన్ని భరిస్తూ అనుకున్న టైంకి ప్రోడక్ట్ సిద్ధమయ్యేలా పూర్తి శ్రమను ధారపోస్తున్నారు. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ అయిపోవడంతో మూడో సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ మాములుగా లేదు.

Related Post

Big update on Vicky Kaushal’s Mahavatar, inspired by Lord Parashurama, revealedBig update on Vicky Kaushal’s Mahavatar, inspired by Lord Parashurama, revealed

Long ago, Vicky Kaushal announced his prestigious project, Mahavatar, which is based on Lord Parashurama, a fierce warrior and one of the ten incarnations of Lord Vishnu. The first look