hyderabadupdates.com Gallery మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఉన్నంత వ‌ర‌కు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా చూస్తాన‌ని అన్నారు. శ‌నివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. 2024 సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది.
పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించి పోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రికి కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.
The post మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌

Russia : భారత్‌కు రష్యా బంపరాఫర్‌ ప్రకటించింది. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.

CM Revanth Reddy: సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలుCM Revanth Reddy: సౌదీ అరేబియా ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

    సౌదీ అరేబియా లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు – ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో 42 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం.

ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ

అమ‌రావ‌తి : ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే పేద‌ల‌కు పెన్ష‌న్లు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంద‌న్నారు. శ‌నివారం ఎన్టీఆర్ భరోసా