hyderabadupdates.com Gallery మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌ post thumbnail image

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వ‌చ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు వెల్ల‌డించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ఆరోజు మ‌ధ్యాహ్నం 3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని తెలిపారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని వెల్ల‌డించారు ఈవో..
రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్య హ‌వచనం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుందని చెప్పారు. ఇదిలా ఉండ‌గా చంద్ర గ్ర‌హ‌ణం కార‌ణంగా మార్చి 3వ‌ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించు కోవాల్సిందిగా కోరారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈసారి నూత‌న టెక్నాల‌జీ సాయంతో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు.
The post మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులుAP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

    కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)