hyderabadupdates.com Gallery మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ post thumbnail image

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫ‌రెంట్ క‌థ‌తో ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , శ్రీ‌లీల‌తో క‌లిసి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తెర‌కెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సాంగ్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా ఈ సినిమా గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. వ‌చ్చే మార్చి నెల‌లో ఉస్తాద్ భ‌గ‌త్ రానుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉండ‌గా త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి కొడుకు, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ‌, జాహ్న‌వి క‌పూర్ క‌లిసి బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ ఉస్తాద్ భ‌గత్ సింగ్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డంతో పెద్ది మూవీ వాయిదా ప‌డే ఛాన్స్ ఉందని సినీ వ‌ర్గాల భోగ‌ట్టా. అయితే హ‌రీష్ శంక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ‌కు మార్చి వీల‌వుతుంద‌ని, అందుకే దానిని సెంటిమెంట్ గా భావించి రిలీజ్ కు సిద్దం చేశామ‌న్నాడు. దీంతో అటు ఉస్తాద్ ఇటు పెద్ది మ‌ధ్య వార్ కొన‌సాగేందుకు వీలు లేదు. ఎందుకంటే అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం విశేషం. ఒక‌రు అబ్బాయి మ‌రొక‌రు బాబాయ్. ఇక వాస్త‌వానికి పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇది కూడా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోంది. ఇక రెండు సినిమాలు క్లాష్ కాకుండా తేదీలు మారే ఛాన్స్ ఉంది. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించారు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను.
The post మార్చిలో రానున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో

స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలిస‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఖాకీలు స‌న్న‌ద్దం కావాలి

హైద‌రాబాద్ : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వ సన్నద్ధం కావాల్సిన‌ అవసరం ఉందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించు కోవాలని పోలీసు శాఖకు సూచించారు.