hyderabadupdates.com movies మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ షాక్

మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ షాక్

భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఇది ఒక అతిపెద్ద ఎదురుదెబ్బ. సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత అయిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, మంగళవారం (అక్టోబర్ 14) మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది కేడర్‌తో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర ఆపరేషన్ల వలన మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఫలితమే ఈ కీలక లొంగుబాటు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకు చెందిన ఈ నేత లొంగుబాటు వెనుక చాలా రోజులుగా ఊహాగానాలు నడిచాయి. సెప్టెంబర్‌లోనే అతను ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆయుధాలు వీడనున్నట్లు పరోక్షంగా సూచించారు. “తమను తామే కాపాడుకోవాలని, లొంగిపోయి మెయిన్‌స్ట్రీమ్‌లో కలవాలని” తన తోటి సహచరులకు కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని మావోయిస్టు కేడర్ నుంచి సోను నిర్ణయానికి మద్దతు లభించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ లొంగుబాటు అనేది భారతదేశంలో మావోయిస్టు ఉద్యమానికి ఒక ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. 2026 నాటికి దేశం నుంచి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే అమిత్ షా లక్ష్యానికి ఈ పరిణామం ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఒక అగ్రనాయకుడు, ఇంతమంది కేడర్‌తో లొంగిపోవడం అనేది ఈ ఉద్యమం బలహీనపడుతోందనడానికి స్పష్టమైన సంకేతం.

2000 సంవత్సరం ఆరంభం నుంచి భారత్ మావోయిజం లేదా నక్సలిజాన్ని (LWE లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) ఒక తీవ్రమైన అంతర్గత భద్రతా ముప్పుగా గుర్తించింది. 2010లో ఈ ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా సుమారు 200 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉండేది. అయితే, 2015లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక కారణంగా పరిస్థితి క్రమంగా మారింది. కేంద్ర ప్రభుత్వం, ప్రభావిత ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా, ఈ ముప్పును క్రమంగా తగ్గించింది. 2024లో, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం సంబంధిత హింసాత్మక సంఘటనలు, పౌరుల మరణాలు 2010తో పోలిస్తే ఏకంగా 81 శాతం నుంచి 85 శాతం వరకు తగ్గాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది.

Related Post

Chiranjeevi & Venkatesh Set the Festive Mood With a Power-Packed TrailerChiranjeevi & Venkatesh Set the Festive Mood With a Power-Packed Trailer

The theatrical trailer of Mana Shankara Vara Prasad Garu has been unveiled in Tirupati, instantly raising excitement among fans and family audiences alike. Headlined by Chiranjeevi and directed by Anil

గెలిచినా.. ఓడినా.. రేవంత్‌కు లిట్మ‌స్ టెస్ట్‌!గెలిచినా.. ఓడినా.. రేవంత్‌కు లిట్మ‌స్ టెస్ట్‌!

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పెద్ద టెస్టే అనే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. 20 నెల‌ల‌కు పైగా సాగుతున్న `ఇందిర‌మ్మ‌` పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఎన్నో మేళ్లు చేశామ‌ని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్ర‌ధాన