hyderabadupdates.com movies మాస్ మహారాజా మార్పు చాలా మంచిది

మాస్ మహారాజా మార్పు చాలా మంచిది

సంక్రాంతికి విడుదల కాబోయే భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ పేరుకు ముందు మాస్ మహారాజా అని ఉండబోవడం లేదు. ఈ మేరకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఫ్యాన్స్ ఆ బిరుదు కోసం ఎదురు చూసి విజిల్స్ వేయడం లాంటివి ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే తన నుంచి మాస్ కంటెంటే కోరుకుంటున్నారని భావించిన రవితేజ చాలా పొరపాట్లే చేశారు. అందుకే మాస్ జాతర, ఖిలాడీ లాంటి డిజాస్టర్లు పడ్డాయి. రిలీజ్ రోజు సాయంత్రం షోకే చేతులు ఎత్తేసే పరిస్థితి ఒకప్పుడు రవితేజకు లేదు. ఫ్లాప్ అయినా సరే ఒక్కసారైనా చూడాలనే ఆడియన్స్ పెద్ద సంఖ్యలో ఉండేవాళ్లు.

అందుకే రవితేజ ప్రాక్టికల్ థింకింగ్ కి వచ్చేశాడు. జనాన్ని మెప్పించాలంటే ఏం కావాలో దానికి రెడీ అవుతున్నాడు. కథ పరంగా భర్త మహాశయులకు కొత్త సబ్జెక్టు కాదు. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల తన ట్రీట్ మెంట్ ని నమ్మమని చెబుతున్నారు. షూటింగ్ కు ముందే ఓటిటి సంస్థ మూడు సార్లు స్క్రిప్ట్ విని డీల్ ఓకే చేసిందంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే. అందుకే పోటీ ఎంత ఉన్నా సరే సంక్రాంతి బరిలోనే దింపుతున్నారు. ఇలా ట్యాగులు వద్దనుకునే స్టార్లు ఈ మధ్య పెరిగిపోతున్నారు. అజిత్, కమల్ హాసన్, నయనతార లాంటి వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ నోట్ వదిలి మరీ బిరుదులు వాడొద్దని చెప్పారు.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ రివెంజ్ థ్రిల్లర్ చేస్తున్న రవితేజ ఈసారి ఫాదర్ సెంటిమెంట్ కి షిఫ్ట్ అయ్యారని సమాచారం. కూతురి కోసం తాపత్రయపడే తండ్రిగా ఒక డిఫరెంట్ షేడ్ ని ఇందులో చూపించబోతున్నారని తెలిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టకుండానే కొత్త సినిమా షూటింగ్ లో రవితేజ బిజీ అయిపోయారు. ఈసారి హిట్టు కొడితే మాత్రం కిక్ మాములుగా ఉండదు. ఇంత హెవీ కాంపిటీషన్ లో నెగ్గుకురావడం అంటే మాటలు కాదు. డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

Related Post

ప్రభాస్ హీరోయిన్లకు ఇది మామూలేప్రభాస్ హీరోయిన్లకు ఇది మామూలే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పని చేసిన వాళ్లందరూ అతడి గురించి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూల్లో కచ్చితంగా చెప్పే విషయం ఒకటుంటుంది. అదే.. తమ ఇంటి వంటలతో అతను అందించే విందు. తాను పని చేసే యూనిట్లో దాదాపుగా

Sankranthi Releases: Huge Scarcity for TheatresSankranthi Releases: Huge Scarcity for Theatres

As announced five films, Prabhas’ Raja Saab, Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu, Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi, Naveen Polishetty’s Anaganaga Oka Raju and Sharwanand’s Naari Naari Naduma Murari have released