hyderabadupdates.com movies మాస్ రాజా టార్గెట్ ఎంత?

మాస్ రాజా టార్గెట్ ఎంత?

మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా.. మాస్ జాతర. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ తిన్న ఆయన.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ చేశాడు. ‘సామజవరగమన’తో రైటర్‌గా మంచి పేరు సంపాదించిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద ఈ సినిమాను నిర్మించాడు. శుక్రవారం ఫస్ట్ షోల నుంచి ఈ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. రేపు పూర్తి స్థాయిలో రిలీజవుతుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్‌తో పోటీ పడుతూ ఈ సినిమా థియేటర్లలోకి దిగింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? ఏమేర కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది? అనే ప్రశ్నలు రవితేజ అభిమానుల్లో ఉన్నాయి.

‘మాస్ జాతర’ బాక్సాఫీస్ టార్గెట్ మరీ పెద్దదేమీ కాదు. వరల్డ్ వైడ్ రూ.21 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది మాస్ రాజా కొత్త సినిమా. అంటే గ్రాస్ రూ.35 కోట్ల మేర రావాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14 కోట్ల షేర్ రాబడితే సినిమా సేఫ్ అవుతుంది. మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినాకు ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. కాకపోతే ఆయన గత చిత్రాల ప్రభావం ఈ సినిమాపై కొంత పడిందన్నది వాస్తవం. అందుకే బిజినెస్ భారీగా జరగలేదు. 

సినిమాకు బాగానే ఖర్చయినప్పటికీ.. ఓటీటీ డీల్ ద్వారా మంచి ఆదాయమే రావడంతో నిర్మాత నాగవంశీ ఓ మోస్తరు రేటుకే సినిమాను అమ్మాడు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2, ప్రొడ్యూస్ చేసిన ‘కింగ్డమ్’ నిరాశ పరిచిన నేపథ్యంలో నాగవంశీ కాస్త తక్కువ రేట్లకే సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సేఫ్ టార్గెట్లే ఉన్నాయి సినిమాకు. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. మాస్ ఈ సినిమాకు కనెక్ట్ అయితే ఈజీగానే పనైపోతుంది.

Related Post

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండికైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, గాలిపటం ఎగరేసేందుకు దారాన్ని ఉపయోగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లుఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్