hyderabadupdates.com movies ‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే నిబంధనలు ఉండకూడదని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పవన్ ఆరోపించారు. పట్టు శాలువాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం సహా అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తిరుమల పవిత్రతను భంగం చేసే అంశాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు.

హిందువులు మెజారిటీ అని భావించడం ఒక భ్రమ మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్న హిందువులు ఏకత చూపకపోతే అన్యాయాలకు గురవుతూనే ఉంటారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, అన్ని మతాలకు సమాన గౌరవం లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Related Post

హీరో విశాల్… పది కోట్లు కట్టు – కోర్టు ఆదేశంహీరో విశాల్… పది కోట్లు కట్టు – కోర్టు ఆదేశం

తెలుగు వాడైన తమిళ హీరో విశాల్‌ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి. ఐతే వాటిలో ఒక వివాదం చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. ఆ వ్యవహారం కోర్టుకు కూడాా వెళ్లింది.

లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

తెలుగులో ఎందరో స్టార్, లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లందరిలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ తెచ్చుకున్నది మాత్రం ఒక్క కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ శిష్యరికంలో రాటుదేలి.. తొలి చిత్రం గులాబీతోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న కృష్ణవంశీ.. తర్వాత నిన్నే