hyderabadupdates.com Gallery మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్

మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్

మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్ post thumbnail image

నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విద‌ర్భ స్టేడియంలో జ‌రిగిన తొలి కీల‌క మ్యాచ్ లో సూర్య భాయ్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు స‌త్తా చాటింది. వ‌చ్చే నెల‌లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హించ‌నుంది. ఇందుకు కీవీస్ తో సీరీస్ మ్యాచ్ ల‌ను స‌న్నాహ‌కంగా భావిస్తోంది జ‌ట్టు. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ భారీ స్కోర్ చేసింది. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తేలి పోయాడు. త‌ను ఆశించిన ప‌రుగులు చేయ‌లేదు. కానీ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి రెచ్చి పోయాడు. వ‌చ్చీ రావ‌డంతోనే కీవీస్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. దీంతో టీమిండియా 48 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 1-0 ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 20 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 190 ర‌న్స్ చేసింది. విద‌ర్బ స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారించారు బ్యాట‌ర్లు. ఇక ఇండియా విష‌యానికి వ‌స్తే ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో దుమ్ము రేపారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.
ఇక ఓపెన‌ర్ అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. త‌ను ఎనిమిది సిక్స‌ర్లు కొట్టాడు. చివ‌ర‌కు రింకూ సింగ్ చెల‌రేగాడు. త‌ను అజేయంగా 44 ర‌న్స్ తో రాణించాడు. దీంతో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 238 ప‌రుగులు చేసింది. ఇక పేల‌వ‌మైన ఫామ్ తో నిన్న‌టి దాకా ఇబ్బంది ప‌డుతూ వ‌చ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఈ మ్యాచ్ లో ప‌ర్వాలేద‌ని అనిపించాడు. త‌ను 39 ప‌రుగులు చేశాడు. అబిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఇక న్యూజిలాండ్ విష‌యానికి వ‌స్తే గ్లెన్ పిలిప్స్ 40 బంతుల్లో 78 ప‌రుగులు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బంతుల‌తో తిప్పేశాడు.
The post మెరిసిన భార‌త్ చేతులెత్తేసిన న్యూజిలాండ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా సహకరించాలి – మంత్రి లోకేశ్‌

    ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్‌ మెక్‌ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్‌ ఎంగేజ్‌మెంట్‌ అజెండాలో ఏపీని

దూసుకుపోతున్న ధనుష్‌!దూసుకుపోతున్న ధనుష్‌!

ఈ ఏడాదిలో సౌత్ హీరోల నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. అలాంటి వారిలో ధనుష్ కూడా ఒకరు. ఆయన ఈ సంవత్సరం ఇప్పటికే కుబేర, ఇడ్లీ కొట్టు సినిమాలతో ప్రేక్షకులను కలిసాడు. కానీ ఇక్కడితో ఆగిపోకుండా మూడో సినిమాను కూడా ఈ

Sudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డిSudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డి

    తాను మంత్రి ప‌ద‌వి ఆశించిన మాట వాస్త‌మేన‌ని తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొన్ని స‌మీక‌ర‌ణాల వ‌ల్ల త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని చెప్పారు. సెక్రటేరియట్‌లో బుధ‌వారం ఉద‌యం ప్రభుత్వ సలహాదారుగా ఆయ‌న