hyderabadupdates.com Gallery మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ

మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ

మెరిసిన విరాట్ కోహ్లీ తొలి  వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ post thumbnail image

వ‌డోద‌ర : కీవీస్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రోసారి స‌త్తా చాటాడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వ‌య‌సులో 91 బంతుల్లో 93 ర‌న్స్ చేశాడు. మ్యాచ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ముందుగా బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ భార‌త్ ముందు 301 ర‌న్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో అనంత‌రం బ‌రిలోకి దిగిన ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై దాడి చేశాడు. సయీద్ అజ్మల్ తొమ్మిదో ఓవర్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. కోహ్లీ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లడానికి నిరాకరించాడు. దానికి బదులుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో (56) కలిసి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇద్ద‌రూ క‌లిసి 118 ర‌న్స్ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.
న్యూజిలాండ్ బౌల‌ర్లు ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. వ‌న్డే సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఆడుతాయి ఇరు జ‌ట్లు. దీంతో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది భార‌త జ‌ట్టు. వ‌న్డే ఫార్మాట్ లో త‌ను కీల‌కంగా మారాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ లో 17 ఏళ్లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచ క్రికెట్ రంగంలో టాప్ లో కొన‌సాగుతున్నాడు ర‌న్ మెషీన్. వ‌రుస‌గా 50 ప‌రుగులు చేయ‌డం ఇది ఐదోసారి. కొత్త సంవ‌త్స‌రంలో త‌న జోరును కొన‌సాగించాడు కోహ్లీ. ఇదిలా ఉండ‌గా టి20 ఫార్మాట్ నుంచి శుభ్ మ‌న్ గిల్ ను తొల‌గించారు. వ‌న్డే సీరీస్ లో త‌ప్పిస్తాడ‌ని అంతా అనుకున్నారు.
The post మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వ‌న్డేలో ఇండియా విక్ట‌రీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

KTR : గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భార‌త్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9

ఆర్సీబీ అదుర్స్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బేవార్స్ఆర్సీబీ అదుర్స్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బేవార్స్

బెంగ‌ళూరు : డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ఝ‌ల‌క్ ఇస్తోంది. తాజాగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు