hyderabadupdates.com movies మేం క్యామియోలు చేస్తాం… మీరు చేయరా?

మేం క్యామియోలు చేస్తాం… మీరు చేయరా?

కన్నడ సినిమా టాప్ స్టార్లలో కిచ్చా సుదీప్ ఒకడు. అతడికి వేరే భాషల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ‘ఈగ’ సహా కొన్ని సినిమాల్లో నటించి తెలుగులో బాగానే గుర్తింపు సంపాదించాడు. హిందీలో కూడా అతను కొన్ని సినిమాల్లో నటించాడు. కన్నడనాట సుదీప్‌‌కు పెద్ద మార్కెట్టే ఉంది.

అతను కన్నడలో అయినా.. మరో భాషలో అయినా.. ఏదైనా ప్రత్యేక పాత్ర చేయాలంటే ఉత్సాహంగా ముందుకు వస్తాడు. హీరోగానే కాక విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తాడు. అలాంటి నటుడు.. తన సినిమాలో క్యామియో చేయడానికి వేరే భాషల నుంచి ఎవ్వరూ ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సుదీప్ మాత్రమే కాక శివరాజ్ కుమార్, ఉపేంద్ర సైతం ఇతర భాషల్లో క్యామియోలు చేస్తుంటారు. కానీ తాము ఇతర భాషలకు వచ్చి ప్రత్యేక పాత్రల్లో నటించినట్లు.. కన్నడ సినిమాల కోసం ఇతర భాషల వాళ్లు ముందుకు రావడం లేదని సుదీప్ ఆవేదన చెందాడు. తాను చాలా సినిమాల్లో డబ్బులు కూడా తీసుకోకుండా క్యామియోల్లో నటించానని.. కానీ తాను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినా సరే.. తమ సినిమాల్లో నటించేందుకు ముందుకు రాలేదని.. ఇక్కడ పరస్పర సాయం అనేది లోపిస్తోందని సుదీప్ అన్నాడు.

సుదీప్ నుంచి క్రిస్మస్ కానుకగా ‘మార్క్’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో క్యామియోల కోసం వేరే భాషల హీరోలను సుదీప్ అడిగితే చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ‘మార్క్’ సినిమాకు రివ్యూలు మిక్స్డ్‌గా వచ్చాయి. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ.. అది బాక్సాఫీస్ దగ్గర నిలబడేలా కనిపించడం లేదు

Related Post

Sri Sravanthi Movies Brings Pranav Mohanlal’s “Dies Irae” to Telugu Theatres This November!Sri Sravanthi Movies Brings Pranav Mohanlal’s “Dies Irae” to Telugu Theatres This November!

Pranav Mohanlal, the talented son of Malayalam superstar Mohanlal, continues to impress audiences across South India with his unique choice of films. After winning hearts with Hridayam, Pranav is now