hyderabadupdates.com movies మొన్న అనిరుధ్ ప్యారడైజ్.. నిన్న రెహమాన్ పెద్ది

మొన్న అనిరుధ్ ప్యారడైజ్.. నిన్న రెహమాన్ పెద్ది

ఈ రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్ కూడా చేయలేని లాభం.. ఒక మంచి పాట చేసేస్తుంది. మంచి ఊపున్న పాట కంపోజ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలితే.. అది క్లిక్ అయిందంటే చాలు, సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. రీల్స్, షార్ట్స్‌లో ఆ పాట వైరల్ అయిందంటే.. జరగాల్సిన ప్రమోషన్ అంతా జరిగిపోతుంది.

ఈ మధ్య కాలంలో అలా బాగా వైరల్ అయిన పాటలు.. ‘పెద్ది’లోని చికిరి చికిరి.. ‘ది ప్యారడైజ్’లోని ఆయా షేర్. ఈ నెల చివర్లో ఒకే వీకెండ్లో విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలు.. వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. వీటి మధ్య ఇప్పుడు పోటీ లేదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సాంగ్స్‌తో ఆ రెండు చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్లూ వావ్ అనిపించారు.

‘పెద్ది’ కోసం ఏఆర్ రెహామన్ కంపోజ్ చేసిన ‘చికిరి’ పాట కొన్ని నెలలుగా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘రా రా రైరా’ కూడా బాగానే జనాలను ఆకట్టుకుంది. మరోవైపు ‘ది ప్యారడైజ్’ సంగీత దర్శకుడు అనిరుధ్ నుంచి ఈ మధ్యే వచ్చిన ఆయా షేర్ కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ పాటల హైప్‌ను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లేలా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు వాటిని ప్రమోట్ చేస్తున్న తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్‌లో ‘ఆయా షేర్’ పాటతో అనిరుధ్ మామూలు రచ్చ చేయలేదు. ‘ది ప్యారడైజ్’ హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా హాజరైన ఈ కన్సర్ట్‌లో ఆ పాటే మేజర్‌ హైలైట్‌గా నిలిచింది.

ఇక ఏఆర్ రెహమాన్ తాజాగా ‘రా రా రైరా’ సాంగ్‌ను చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరిలో పెర్ఫామ్ చేశారు. ఇది క్రికెట్ నేపథ్యం ఉన్న పాట కావడంతో అక్కడి జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఆల్రెడీ ‘రా రా రై రా’ పాటను క్రికెట్ లవర్స్ బాగా వాడుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ ఈ పాటను సీఎస్కే ఈవెంట్లో పెర్ఫామ్ చేసి దాని పాపులారిటీని మరింత పెంచాడు. ఇలా ఇద్దరు టాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు పాటల మీద ఇంత శ్రద్ధ పెట్టి, ప్రమోట్ చేయడం విశేషమే.

Related Post

ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేయ‌మ‌ని నిధిని అడిగితే..ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేయ‌మ‌ని నిధిని అడిగితే..

గ‌త బుధ‌వారం ‘రాజాసాబ్’ రెండో పాట లాంచ్ కోసం హైదరాబాద్ కూకటపల్లిలోని ‘లులు మాల్’లో చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో ఎంత అస్తవ్యస్తంగా తయారైందో తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడ‌గా.. వారి మ‌ధ్య నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను బయటికి

పెట్టుబడుల వేట.. అమరావతి టూ దావోస్పెట్టుబడుల వేట.. అమరావతి టూ దావోస్

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాలుగు రోజుల దావోస్ పర్యటన ప్రారంభమవుతోంది. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో