hyderabadupdates.com movies మోహన్ లాల్ కుటుంబంలో విషాదం

మోహన్ లాల్ కుటుంబంలో విషాదం

మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆమె వయసు 90 ఏళ్లు. శాంతకుమారి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంత కాలంగా ఆమె మంచానికే పరిమితం అయ్యారు. కోచిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ ఇంటిలోనే శాంతకుమారి తుది శ్వాస విడిచారు. శాంతకుమారి సొంత ఊరు ఎలంతూర్ కాగా.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తిరువనంతపురంలో స్థిరపడ్డారు.

ఉన్నత విద్యావంతురాలైన ఆమె.. కేరళ ప్రభుత్వ న్యాయ కార్యదర్శిగా పని చేయడం విశేషం. అనారోగ్యం పాలయ్యాక తల్లిని మోహన్ లాల్ కోచిలో తన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తల్లి మరణం నేపథ్యంలో తాను చిన్నపిల్లాడిగా ఉండగా ఆమెతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో మోహన్ లాల్ పంచుకున్నారు.

‘అమ్మ’ అనే కామెంట్‌కు లవ్ ఎమోజీ జోడించి పోస్టు పెట్టారు.ఏ వయసులో అయినా సరే తల్లి మరణం ఓ వ్యక్తికి తీవ్ర భావోద్వేగానికి గురి చేసేదే. ఈ నేపథ్యంలో మోహన్ లాల్‌కు సామాజిక మాధ్యమాల్లో సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ నటుడిని అందించిన శాంతకుమారిని అందరూ కొనియాడుతున్నారు.

Related Post

Baahubali The Epic completes censor; official runtime revealedBaahubali The Epic completes censor; official runtime revealed

SS Rajamouli and Prabhas’ monstrous blockbusters Baahubali: The Beginning and Baahubali: The Conclusion are set to re-release as a single film titled Baahubali:The Epic on October 31 in multiple formats.

Ram is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topicRam is the King of Hearts – Bhagyashri Borse’s speech becomes a hot topic

Talented actress Bhagyashri Borse’s speech at Andhra King Taluka’s musical concert at RK Beach in Vizag on Saturday night continues to be a hot topic. The way Bhagyashri showered praises,

విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

రాజ‌కీయాల్లో విధేయుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కొత్త‌కాదు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత‌ల ప‌ట్ల విధేయంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వులు అల‌వోక‌గా వ‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జ‌న‌సేన‌లోనూ.. ఇదే త‌రహాలో ప‌ద‌వులు వ‌స్తున్నాయి. పార్టీలో న‌మ్మ‌కంగా ఉంటూ.. గ‌త