hyderabadupdates.com movies యల్లమ్మ.. అటు తిరిగి ఇటు తిరిగి…

యల్లమ్మ.. అటు తిరిగి ఇటు తిరిగి…

యల్లమ్మ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి వార్తల్లో ఉన్న సినిమా. ‘బలగం’ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన కమెడియన్ వేణు.. తన రెండో సినిమాగా ‘యల్లమ్మ’ తీయాలనుకున్నాడు. ముందు నేచురల్ స్టార్ నానిని ఈ సినిమాకు హీరోగా అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు సైతం ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. కానీ కథల విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందని నాని.. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. తర్వాత నితిన్ దగ్గరికి ఈ కథ వెళ్లింది. అతను ఒక ఏడాది పాటు వేణుతో ట్రావెల్ చేశాడు. 

ఇది పెద్ద బడ్జెట్ మూవీ కావడంతో నితిన్ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటపడి కొంచెం కుదురుకుంటాడేమో అని ఎదురు చూశారు. కానీ గత ఏడాది చివర్లో ‘రాబిన్ హుడ్’తో షాక్ తిన్న నితిన్.. ఇటీవల ‘తమ్ముడు’తో ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తిన్నాడు. తన బేనర్లోనే చేసిన ‘తమ్ముడు’ పెద్ద హిట్టయిపోతుందని.. ఆ తర్వాత నితిన్‌తో ‘యల్లమ్మ’ తీద్దామని ప్లాన్ చేసుకున్న రాజు.. ఆ సినిమా తేడా కొట్టడంతో వెనక్కి తగ్గాడు. నితినేమో.. విక్రమ్ కుమార్ సినిమా వైపు మళ్లాడు. దీంతో వేణుకు మళ్లీ వెతుకులాట తప్పలేదు. ఐతే ఎట్టకేలకు అతను తన సినిమాకు హీరోను ఖాయం చేసుకున్నట్లు సమాచారం.

లేటెస్ట్‌గా ‘కిష్కింధపురి’తో హిట్టు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ‘యల్లమ్మ’లో లీడ్ రోల్ చేయబోతున్నాడన్నది తాజా కబురు. దిల్ రాజే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. శ్రీనివాస్‌కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉండడం ప్లస్ పాయింట్. ‘యల్లమ్మ’ను పాన్ ఇండియా మూవీగానే చేయాలనుకుంటున్నారు. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారనే నమ్మకం టీంలో ఉంది. పైగా శ్రీనివాస్‌తో సినిమా అంటే.. ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ఫినాన్షియల్ బ్యాకప్ కూడా ఇస్తాడు. మంచి కథ కావడంతో శ్రీనివాస్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.

Related Post

ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్

చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. గ‌త నెల రోజుల్లో ప‌లుమార్లు ఆయ‌న పేరు హాట్ టాపిక్‌గా మారింది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్లో చేసిన ప్ర‌సంగం వివాదాస్ప‌దం కాగా..

ఎస్‌! వైఎస్‌-కేసీఆర్ నుంచి మీరు నేర్చుకున్న‌దేంటి జ‌గ‌న్ స‌ర్‌?ఎస్‌! వైఎస్‌-కేసీఆర్ నుంచి మీరు నేర్చుకున్న‌దేంటి జ‌గ‌న్ స‌ర్‌?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ.. కొన్ని విష‌యాల‌ను ప్ర‌స్తావించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అవి త‌న‌కు మాత్రం వ‌ర్తించ‌వ‌ని అనుకున్నారో ఏమో.. అనే సందేహం వ‌స్తోంది. ఎందుకంటే.. హైటెక్ సిటీని తానే డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు

ఫేక్ న్యూస్ వ‌ల్ల నా త‌ల్లి చ‌నిపోయింది-హేమ‌ఫేక్ న్యూస్ వ‌ల్ల నా త‌ల్లి చ‌నిపోయింది-హేమ‌

ఏడాదిన్న‌ర కింద‌ట బెంగ‌ళూరులో జ‌రిగిన ఒక రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి హేమ పాల్గొన్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డం క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. ఐతే తాను ఆ పార్టీకి హాజ‌రే కాలేద‌ని.. ఆ టైంలో తాను హైదరాబాద్‌లోని ఒక ఫాం