hyderabadupdates.com movies యూత్ జోరు ఇక్కడ తక్కువే

యూత్ జోరు ఇక్కడ తక్కువే

తమిళనాడులో మొన్న ఉగాదికి విడుదలైన యూత్ పదకొండు రోజులకే యాభై కోట్ల వసూళ్లు దాటేసి సూపర్ హిట్ ముద్ర వేయించేసుకుంది. ఇప్పటికీ కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ దురంధర్ ది రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ పోటీ వల్ల థియేటర్లు సరిపడా దొరకవనే ఉద్దేశంతో ఎనిమిది రోజులు ఆలస్యంగా తీసుకొచ్చారు. ప్రమోషన్లకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ కావడంతో శర్వానంద్ వచ్చి పబ్లిసిటీలో పాలు పంచుకున్నాడు.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో యూత్ ప్రభావం ఏ సెంటర్స్ కే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ప్రేమలు తరహాలో మేజిక్ చేస్తుందని భావించిన బయ్యర్లకు అంత పెద్ద ఫలితం దక్కేలా లేదు. హైదరాబాద్ లోని చాలా థియేటర్లలో ఆదివారం ఫుల్స్ పడ్డాయి. కానీ అదే రెస్పాన్స్ బయట కూడా ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టం. సిటీలో సైతం సోమవారం నుంచి కూడా ఇదే దూకుడు చూపిస్తుందా అంటే అనుమానంగానే ఉంది.

దీనికి కారణం లేకపోలేదు. యూత్ లాంటి ఎంటర్ టైనర్లు మనోళ్లు చాలానే చూశారు. టీనేజ్ రొమాన్స్, పాటలు. స్కూల్ నేపథ్యం, యువతలో ఎమోషన్లు ఇవన్నీ టాలీవుడ్ లో ఆల్రెడీ అరిగిపోయాయి. అయినా సరే యూత్ లో ట్రీట్ మెంట్ పరంగా ఓ మోస్తరు ఫ్రెష్ నెస్ ఉండటంతో కుర్రకారు కొంత మేర అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఓవరాల్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని రప్పించడంలో మాత్రం తెలుగు యూత్ తడబడుతున్న మాట వాస్తవం.

ఇంకో అయిదు రోజులు మాత్రమే టైం ఉంది. ఈ శుక్రవారం శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాస ఏప్రిల్ 3 రాబోతున్నాయి. బజ్ పరంగా రెండూ నువ్వా నేనాని పోటీ పడుతున్నాయి. సో యూత్ ఆలోగా వీలైనంత రాబట్టుకోవాలి. ప్రచారం విషయంలో టీమ్ యాక్టివ్ గా ఉంది. హైదరాబాద్ లోనే ఉంటూ గట్టిగా పుష్ చేసుకుంటోంది. దురంధర్ తప్ప వేరే ఆప్షన్ లేని టైంలో ఇలాంటి సినిమాలు ఇంకాస్త బలమైన కంటెంట్ తో వచ్చి ఉంటే లవ్ టుడే, ప్రేమలుని మించి పోయేవి.

Related Post

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే ముందు చివ‌ర‌గా న‌టించిన చిత్రం.. జ‌న‌నాయ‌గ‌న్. తెలుగు హిట్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా తెర‌కెక్కిన‌ప్ప‌టికీ… విజ‌య్ పొలిటిక‌ల్ జ‌ర్నీకి