hyderabadupdates.com movies యూత్ హీరోకి ఇంత గ్యాప్ సేఫ్ కాదు

యూత్ హీరోకి ఇంత గ్యాప్ సేఫ్ కాదు

మూడేళ్లకు పైగా సమయాన్ని కేవలం ఒక్క సినిమా కోసమే వెచ్చించిన రోషన్ మేకకు ఛాంపియన్ రూపంలో ఫలితం వచ్చేసింది. యునానిమస్ గా సూపర్ హిట్టని వినిపించలేదు కానీ మంచి ప్రయత్నమనే ప్రశంసలు దక్కాయి.

మొదటి రోజు మంచి ఓపెనింగ్ దక్కగా వీకెండ్ కూడా కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. అయితే సోమవారం ఆక్యుపెన్సీలు ఎంత మొత్తంలో డౌన్ అవుతాయనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. రిస్క్ లేకుండా తక్కువ బడ్జెట్స్ తో రూపొందిన శంబాల, ఈషా క్రిస్మస్ పోటీలో దూసుకుపోతుండగా దండోరా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రగులవుతోంది.

ఛాంపియన్ సంగతి పక్కనపెడితే రోషన్ మేక ఇకపై స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. ఇలా ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాలు తీసుకోవడం ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే శ్రీకాంత్ వారసుడిగా తనకు గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ మార్కెట్ తో సంబంధం లేకుండా నెత్తిన బెట్టుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ తండ్రికి ఇప్పుడు లేదు.

శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాక ప్రత్యేకంగా అభిమానులు అంటూ పెద్దగా లేరు. సో రోషన్ ఇప్పుడు స్వంతంగా తన ఫ్యాన్ బేస్ తానే తయారు చేసుకోవాలి. నటన, డాన్స్ పరంగా ఛాంపియన్ లో పాసు మార్కులు తెచ్చుకున్నా ఛాలెంజ్ అనిపించే రోల్స్ చేయాలి.

ప్రస్తుతం రోషన్ మేక దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో శైలేష్ కొలను దర్శకుడిగా ఒక రామ్ కామ్ ప్లానింగ్ లో ఉందట. ఫైనల్ నెరేషన్ ఓకే అయ్యాక ప్రకటన రావొచ్చు.

రెండోది గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏ మాయ చేసావే తరహాలో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అనుకున్నారట. కానీ ప్రొడ్యూసర్ ఎవరనేది బయటికి రాలేదు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా రోషన్ ని కలిసి శుభాకాంక్షలు అందజేయడమే కాక ఒక సినిమాను కూడా లాక్ చేసుకోవడం చూస్తుంటే ఇదే ఆ గౌతం మీనన్ తో తీయబోయే మూవీ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

ఏది ఏమైనా రోషన్ మేక ఏడాదికి కనీసం రెండు రిలీజులు ఉండేలా చూసుకోవడం అవసరం. లేకపోతే కాంపిటీషన్ లో వెనుకబడే రిస్క్ ఉంది. అసలే మార్కెట్ లో బోలెడు హీరోలున్నారు.

Related Post

Rajasekhar’s Comeback Glimpse Ignites Buzz for Sharwa’s BikerRajasekhar’s Comeback Glimpse Ignites Buzz for Sharwa’s Biker

The makers of the upcoming Telugu sports-family drama Biker have sparked fresh excitement with the release of a powerful re-start glimpse introducing Rajasekhar as Bullet Sunil. Released on Rajasekhar’s birthday,

‘మా బాస్ కేసీఆర్’… ఈటల కామెంట్లు వైరల్‘మా బాస్ కేసీఆర్’… ఈటల కామెంట్లు వైరల్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమ నేతగా, సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ కు సేవలందించిన సీనియర్ పొలిటిషియన్ గా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, గులాబీ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా