hyderabadupdates.com movies రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేద్దామని రెడ్ లో నటిస్తే పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కాదు బోయపాటిని నమ్ముకుంటే తిరుగుండదని స్కంద చేస్తే అది కూడా వీటి దారే పట్టింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది కదాని డబుల్ ఇస్మార్ట్ ట్రై చేస్తే దాని నష్టాల నుంచి కోలుకోవడానికి పూరి జగన్నాథ్ కు చాలా టైం పట్టింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ బాగానే ఉందన్న ఆంధ్రకింగ్ తాలూకా బోల్తా కొట్టడం నిజంగా షాకే. తనకే కాదు ఇండస్ట్రీనే దీన్నో కేస్ స్టడీలా చూసే పరిస్థితి వచ్చింది. కనీసం బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఎవరూ ఊహించనిది.

ఈ సినిమా కోసం గీత రచయితగా మారిన రామ్ ఒక పాట రాసిన సంగతి తెలిసిందే. సాంగ్ బాగానే వెళ్ళింది కానీ లిరిక్స్ అయితే మరీ గొప్పగా లేవు. కాకపోతే ఒక నటుడు ఆ మాత్రం సాహిత్యం ఇవ్వడం గొప్ప విషయమే. ఇప్పుడీ పరిధి దాటి రామ్ స్వయంగా స్టోరీ రైటర్ కాబోతున్నాడని లేటెస్ట్ అప్డేట్. తనకు నచ్చేలా సూటయ్యేలా స్వంతంగా కథ రాసుకున్నాడట. పూర్తి సంతృప్తి కలిగాక అప్పుడు నిర్మాణ సంస్థ, దర్శకుడిని నిర్ణయించుకుంటాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడితో హారర్ కామెడీ చేసే ఆలోచనలో ఉన్న రామ్ దానికి ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓకే కాగానే అనౌన్స్ మెంట్ వస్తుందని వినికిడి.

ఇలా హీరోలే కథలు రాసుకోవడం, స్క్రిప్ట్ లో పాలు పంచుకోవడం కొత్త కాదు. కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ఈ జాబితాలో ఉన్నాడు. ఒకప్పుడు కృష్ణ, ఎన్టీఆర్ లాంటి లెజెండరీ స్టార్స్ కథలు రాసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. చిరంజీవి మృగరాజుకి కథ ఇచ్చింది నాగబాబే. అఫ్కోర్స్ అది హాలీవుడ్ మూవీ ఫ్రీ మేక్ కావడం వేరే విషయం. ఇప్పుడు రామ్ ఎలాంటి జానర్ లో సబ్జెక్టు రాసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీన్ని ప్రతిపాదన కిందే చూడాలి. తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదైనా దక్కాలని వాళ్ళ కోరిక.

Related Post

ఎల్లమ్మ… దేవి చేతికి వచ్చిందమ్మా ?ఎల్లమ్మ… దేవి చేతికి వచ్చిందమ్మా ?

నిర్మాత దిల్ రాజు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న భారీ బడ్జెట్ మూవీ ఎల్లమ్మ. బలగం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి రెండు పట్టు వదలని విక్రమార్కుడిలా దీని కోసమే కష్టపడుతున్నాడు. ముందు న్యాచురల్ స్టార్ నానికి నచ్చింది. కానీ డేట్లు

బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్