hyderabadupdates.com movies రణబాలి రూమర్లకు దర్శకుడి చెక్

రణబాలి రూమర్లకు దర్శకుడి చెక్

చాలా తక్కువ సమయంలో పెద్ద రేంజికి ఎదిగిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. ఒక దశ దాటాక ఆ రేంజికి తగ్గ సినిమాలు అందించలేకపోయాడు. ఓ మంచి విజయం కోసం చాలా ఏళ్ల నుంచి అతను ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది ‘కింగ్డమ్’తో అతడి ఆశ నెరవేరుతుందనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.

ఐతే కొత్త ఏడాదిలో ఒకటికి రెండు ప్రామిసింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్. అందులో ఒకటి ‘రౌడీ జనార్దన’. ఆ చిత్రం డిసెంబరులో విడుదల కాబోతోంది. దాని కంటే ముందు అతడి మరో సినిమా ‘రణబాలి’ ప్రేక్షకులను పలకరించబోతోంది.

నిన్ననే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబరు 11నే రిలీజ్ అని కూడా ప్రకటించారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ వారి మీద వీరోచితంగా పోరాడిన ఒక అన్ సంగ్ హీరో కథ ఇదని తెలుస్తోంది.

నిన్న రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఈ గ్లింప్స్‌ను ఏఐ వాడి క్రియేట్ చేశారంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మధ్య సినిమా గురించి ఒక కబురు తెలిస్తే చాలు.. ఏఐ ద్వారా కథలనే క్రియేట్ చేసేస్తున్నారు నెటిజన్లు.

‘రణబాలి’ గ్లింప్స్‌ను కూడా అలాగే చేశారంటూ దాని మీద సెటైర్లు వేస్తున్నారు కొందరు. దీనిపై దర్శకుడు రాహుల్ సంకృత్యన్ స్పందించాడు. ‘రణబాలి’ వీడియోను ఏఐతో తయారు చేయలేదని రాహుల్ స్పష్టం చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ను పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేశామని.. ఈ గ్లింప్స్‌ను సిద్ధం చేయడానికి తమ బృందానికి నెలల సమయం పట్టిందని అతను వెల్లడించాడు.

ఈ రోజుల్లో ఏది ఒరిజినలో, ఏది ఏఐనో కనిపెట్టడం కష్టమైపోతున్న నేపథ్యంలో.. ఎంతో కష్టపడి చేసిన పనికి కూడా గుర్తింపు రాని పరిస్థితి తలెత్తుతోంది. రాహుల్ ఎంత కమిట్మెంట్ ఉన్న దర్శకుడో అతను తీసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలను చూస్తే అర్థమవుతుంది.

కాబట్టి ఎంతో కష్టపడి చేసిన వీడియోను ఏఐ గాటన కట్టి తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన్నా కథానాయికగా చేస్తోంది. ఇందులో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Related Post

Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi Glimpse Promises Fun Family RideRavi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi Glimpse Promises Fun Family Ride

Mass Maharaja Ravi Teja is back with a refreshing entertainer titled Bhartha Mahasayulaku Wignyapthi, directed by Kishore Tirumala and produced by Sudhakar Cherukuri under SLV Cinemas, with Zee Studios presenting

ఇంటికి త్వరగా వస్తున్న అన్నగారుఇంటికి త్వరగా వస్తున్న అన్నగారు

మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు వాయిదాని క్యాష్ చేసుకుందామని చూసిన దర్శక నిర్మాతలకు డిజాస్టర్ దక్కింది. డిసెంబర్ లోనే రావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల