hyderabadupdates.com movies రష్మిక ప్రేమలో పడ్డాక డౌటొస్తే

రష్మిక ప్రేమలో పడ్డాక డౌటొస్తే

ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు.. రష్మిక మందన్నా. బహు భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. నిలకడగా హిట్లు అందుకుంటూ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది ఈ కన్నడ భామ. గత ఏడాది ‘పుష్ప-2’తో రికార్డు బ్రేకింగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక.. 2025 ఆరంభంలో ‘ఛావా’తో ఇంకో భారీ విజయాన్ని అందుకుంది.

కొన్ని నెలల కిందట ‘కుబేర’ లాంటి మరో మంచి సినిమాతో పలకరించిన రష్మిక.. ఇప్పుడు తనే లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’తో ప్రేక్షకులను పలకరించబోతోంది. నవంబరు 7న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు దీని ట్రైలర్ లాంచ్ చేశారు. ‘చి ల సౌ’, ‘మన్మథుడు-2’ చిత్రాలను రూపొందించిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. ధీరజ్ దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా నటించాడు. అను ఇమ్మాన్యుయెల్ ముఖ్య పాత్ర పోషించింది.

‘ది గర్ల్ ఫ్రెండ్’ టైటిల్‌కు తగ్గట్లే ప్రేమ చుట్టూ తిరిగే సినిమా. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడ్డాక.. ఒకరికి ఒకరు సరైన జోడీయేనా అనే సందేహాలు వారిలో కలిగితే ఎలా ఉంటుంది.. వీరి మధ్యలోకి ఇంకో అమ్మాయి వస్తే పరిస్థితి ఏంటి.. ఈ సంఘర్షణ వల్ల ఆ రిలేషన్‌షిప్ ఏ తీరానికి చేరింది అనే కాంప్లెక్స్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లున్నాడు రాహుల్ రవీంద్రన్. కథ, పాత్రలు, డైలాగులు.. అన్నీ ట్రెండీగా అనిపిస్తున్నాయి.

రష్మిక.. ధీరజ్.. రావు రమేష్‌ల పెర్ఫామెన్స్ కూడా పీక్స్‌లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ధీరజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేశాడిందులో. రష్మిక అభిమానులకు తన పాత్ర, పెర్ఫామెన్స్ మంచి కిక్కే ఇచ్చేలా ఉన్నాయి. హేషమ్ అబ్దుల్ సంగీతం, కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం ట్రైలర్లో హైలైట్ అయ్యాయి. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రెజెంట్ చేస్తున్నారు.

Related Post