hyderabadupdates.com movies రహదారుల నాణ్యత నేనే స్వయంగా చెక్ చేస్తా: పవన్

రహదారుల నాణ్యత నేనే స్వయంగా చెక్ చేస్తా: పవన్

‘రహదారుల నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాము. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దు… ‘ అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చిందన్నారు. రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించిందని ఆరోపించారు.

ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నాము. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు అన్నారు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయండి. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Related Post

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ గ్రిల్స్.. రియల్ గా ఏం తింటాడో తెలుసా?‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ గ్రిల్స్.. రియల్ గా ఏం తింటాడో తెలుసా?

డిస్కవరీ ఛానెల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ చూసి పెరిగిన 90s కిడ్స్ ఎవరైనా బేర్ గ్రిల్స్ ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు. అడవిలో పరుగులు, బల్లులు, పాములు ఇలా దొరికితే అది తినేసే ఈ సాహసవీరుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటాడో తెలుసుకోవాలనే

Lakshmi Manchu’s Teach For Change 2026 Raises Hope for Govt School ChildrenLakshmi Manchu’s Teach For Change 2026 Raises Hope for Govt School Children

Hyderabad witnessed a meaningful blend of glamour and social purpose as actor and philanthropist Lakshmi Manchu hosted the annual fundraising event of Teach For Change 2026 at HICC Convention Centre

మహేష్ సినిమా క్లైమాక్స్.. దర్శకుడు చెప్పిన సీక్రెట్మహేష్ సినిమా క్లైమాక్స్.. దర్శకుడు చెప్పిన సీక్రెట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘మురారి’ ఒకటి. కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలనటుడిగా అడుగు పెట్టిన అతడికి ఆ వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆపై పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేసినపుడు