hyderabadupdates.com movies రాంబాయి జోరు ఎక్కడిదాకా ఎప్పటిదాకా

రాంబాయి జోరు ఎక్కడిదాకా ఎప్పటిదాకా

కొత్త రిలీజుల్లో ఒక్క రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే థియేటర్లలో జనాన్ని నింపుతోంది. మిగిలిన కొత్త సినిమాలన్నీ అంతంత మాత్రం టాక్ తో ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్దోగొప్పో పర్వాలేదనిపించుకున్న పాంచ్ మినార్ సరైన ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి చేరువ కాలేకపోతోంది. ప్రెస్ మీట్లు గట్రా రాజ్ తరుణ్ టీమ్ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో హెవీ ఎమోషన్స్ ఉన్న కథైనా సరే రాజు వెడ్స్ రాంబాయికే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అయితే దీని దూకుడు నైజామ్ లో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నేటివిటీ సమస్యో మరొకటో కానీ ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు వేగంగా లేవు.

రెండు రోజులకు సుమారు నాలుగు కోట్ల దాకా రాజు వెడ్స్ రాంబాయి వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలు 69 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. మాములుగా టయర్ 2 హీరోలకే ఇలాంటి నెంబర్ కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ రాజుగాని ప్రేమకథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎక్కువ రెవిన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మాస్ ఆదరణ బాగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏపీ సైడ్ రేపటి నుంచి బాగా డ్రాప్ అవుతుందనే అంచనాలున్న నేపథ్యంలో దాన్నేమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

సండే కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ అంకెలతోనే నమోదు కావడం ఖాయం. చాలా చోట్ల స్క్రీన్లు పెంచారు. అయితే నిర్మాతలు ప్రకటించిన 99, 105 రూపాయల టికెట్ల స్థానంలో చాలా మంది ఎగ్జిబిటర్లు పాత ధరలే పెట్టడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫర్ ఒక్క రోజే అని నిర్మాతలు ముందే ప్రకటించకపోవడం దీనికి కారణం. ఫ్లాప్ టాక్ వస్తే ఆఫర్ కొనసాగేదని, హిట్ టాక్ రావడం వల్ల అప్పటికప్పుడు రేట్లు మార్చేశారని ప్రేక్షకుల కంప్లైంట్. సరే ఏదైతేనేం మొత్తానికి హిట్టు స్టాంప్ వేయించుకున్న రాజు వెడ్స్ రాంబాయి తక్కువ బిజినెస్ కాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసింది కానీ ఎంత లాభాలు నమోదు చేస్తుందో చూడాలి.

Related Post

నెటిజ‌న్ల కామెంట్‌: ఇప్పుడు ఎన్ని చెబితే ఏంటి ‘పీకే’ స‌ర్‌!నెటిజ‌న్ల కామెంట్‌: ఇప్పుడు ఎన్ని చెబితే ఏంటి ‘పీకే’ స‌ర్‌!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ పీకే.. బీహార్ లో జ‌రిగిన తాజా అసెంబ్లీ ఎన్ని క‌ల్లో చావు దెబ్బ‌తిన్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న క‌నీసం 230 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా.. ఒక్క‌రు