hyderabadupdates.com movies రాజమౌళి ఇంత అడ్వాన్స్ ఎందుకున్నారు

రాజమౌళి ఇంత అడ్వాన్స్ ఎందుకున్నారు

వారణాసి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న సిసిఎక్స్పి ఈవెంట్ లో షూటింగ్, మేకింగ్ తాలూకు క్లిప్స్ ప్రదర్శించడంతో పాటు రాజమౌళి మాట్లాడిన వీడియోని చూపించారు. అంతే కాదు ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యక్షంగా అక్కడ హాజరై ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడమే కాక ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత తీసుకున్నారు.

నిజానికీ టైంలో ఇది అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ లో వారణాసిని లైమ్ లైట్ లో పెట్టాలని చూస్తున్న రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటిదాకా ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఒకే కంటెంట్ వచ్చింది. అది కూడా కాన్సెప్ట్ టీజర్. నిజంగా సినిమాలో ఉన్న విజువల్స్ కావవి. మహేష్ బాబు కనిపించే షాట్ తప్ప మిగిలినదంతా కథని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం రా ఫుటేజ్ నుంచి కంటెంట్ కట్ చేశారు.

అసలు ఇంత అడ్వాన్స్ గా జక్కన్న ఎందుకు ఉన్నారనే ప్రశ్న మూవీ లవర్స్ లో తలెత్తుతోంది. ఇది అర్థం కావాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. చేతిలో 12 నెలల సమయం కూడా లేదు. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోవస్తోంది. నిర్మాతలు వారణాసిని గ్లోబల్ లెవెల్ లో అంతర్జాతీయ సంస్థలతో టై అప్ చేసుకుని అన్ని దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు. సో విదేశీ మీడియా సంస్థలు దీని గురించి రెగ్యులర్ గా మాట్లాడాలి అంటే గ్లోబల్ వేదికల మీద క్రమం తప్పకుండా కనిపించాలి.

ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది వచ్చారు అనే దాని కన్నా ఎక్కడెక్కడ వారణాసి రీచ్ అయ్యింది, ఏ కంట్రీస్ లో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయనేదే రాజమౌళికి ముఖ్యం. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడే సమయంలో ఇండియాలో పబ్లిసిటీ చేయడానికే ఒక రెండు నెలలు అవసరం. అలాంటప్పుడు యుఎస్, యుకె లాంటి ప్రధాన దేశాలు మినహా మహేష్ టీమ్ అన్నిచోట్లకు వెళ్ళలేదు. అందుకే ఇప్పటి నుంచే వారణాసిని ఇంత కాన్సన్ ట్రేటెడ్ గా ప్రచారం చేస్తున్నారు.

Related Post

బాబు బెంగాల్‌కు.. లోకేష్ అస్సాం?బాబు బెంగాల్‌కు.. లోకేష్ అస్సాం?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ

ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కాపులను కేంద్రంగా చేసుకుని నాయకులు కామెంట్లు కురిపిస్తున్నారు. దీనిలో భాగంగానే అంబటి రాంబాబు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపే ప్రయత్నం చేశారు. ఇక, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం సీఎం

స్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లోస్వయంభు సంభవం… సరికొత్త స్టయిల్లో

నిఖిల్ హీరోగా రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ విడుదల