hyderabadupdates.com movies రాజమౌళి రిహార్సల్స్ వెనుక…

రాజమౌళి రిహార్సల్స్ వెనుక…

షూట్ మొద‌లు కావ‌డానికి ముందే వ‌ర్క్ షాప్స్ నిర్వ‌హించ‌డం, రిహార్స‌ల్స్ చేయించడం రాజ‌మౌళి సినిమాల‌కు ప‌రిపాటిగా మారింది. ముఖ్యంగా బాహుబ‌లి నుంచి త‌ప్ప‌క ఈ ప‌ద్ధ‌తిని ఫాలో అవుతున్నాడు. బ‌రిలోకి దిగే ముందు ఎంత బాగా స‌న్న‌ద్ధ‌మైతే.. ఔట్ పుట్ అంత బాగా వ‌స్తుంద‌న్న‌ది జ‌క్క‌న్న న‌మ్మ‌కం.

ఐతే ఈ వ‌ర్క్ షాప్‌లు, రిహార్స‌ల్స్ ఆషామాషీగా ఉండ‌వ‌ద‌న్న‌ది ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వాళ్లు చెప్పే మాట‌. హాలీవుడ్లో కూడా సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా సైతం జ‌క్క‌న్న కొత్త సినిమా వార‌ణాసి కోసం జ‌రిగిన ప్రిప‌రేష‌న్ వ‌ర్క్ గురించి ఇంట‌ర్వ్యూలో గొప్ప‌గా చెబుతోంది.

మ‌హేష్ బాబు సైతం ఆ క‌ష్టం గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడాడు. తాజాగా ఒక ఇంట‌ర్వ్వ్యూలో రాజమౌళి ఈ టాపిక్ మీద మాట్లాడాడు. రిహార్స‌ల్స్ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుందో.. వాటి ప్ర‌యోజ‌నం ఏమిటో.. దాని వెనుక ఎంత క‌ష్టం ఉంటుందో ఆయ‌న వివ‌రించాడు.

రిహార్స‌ల్స్ చేసేట‌పుడు న‌టీన‌టుల‌కు డైలాగ్ పేప‌ర్ ఇచ్చేసి.. వాళ్లు డైలాగులు చెబుతున్న‌పుడు వివిధ యాంగిల్స్‌లో కెమెరాలు పెట్టించి రికార్డ్ చేయించ‌డం ద్వారా.. సూక్ష్మ‌ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని రాజ‌మౌళి వెల్ల‌డించాడు.

ఆర్టిస్టులు ఫ‌లానా విధంగా డైలాగ్ చెప్పాలి అని హింట్ ఇవ్వ‌కుండా.. వాళ్ల‌కు సౌక‌ర్యంగా ఉండే అనేక విధాలుగా ప్ర‌య‌త్నించ‌మ‌ని చెబుతాన‌న్నాడు. ఒక చోట నిల‌బ‌డి.. న‌డుస్తూ.. దేనికైనా ఆనుకుని… ఇలా భిన్న ర‌కాలుగా డైలాగులు చెప్పించి.. ప్ర‌తిదీ రికార్డ్ చేయిస్తాన‌ని.. ఎలా చెబితే డైలాగ్ ప‌ర్ఫెక్ట్‌గా వ‌స్తుంది.. ఎమోష‌న్ స‌రిగ్గా క్యారీ అవుతుంది అన్న‌ది వివిధ కెమెరాల ద్వారా ప‌రిశీలిస్తామ‌ని..

ఇలా ఆర్టిస్టుల నుంచి ది బెస్ట్ రాబ‌ట్టుకునేలా ఈ రిహార్స‌ల్స్ న‌డుస్తాయ‌ని.. ఈ ప్ర‌క్రియ అంతా ఒక ఫుల్ లెంగ్త్ షూట్ త‌ర‌హాలో ప‌క‌డ్బందీగా జ‌రుగుతుంద‌ని రాజ‌మౌళి తెలిపాడు. ఈ ప్రిప‌రేష‌న్ వ‌ర్క్ ప‌క్కాగా జ‌ర‌గ‌డం వ‌ల్ల అస‌లు షూటింగ్ తేలిక అవ‌డ‌మే కాక‌.. బెస్ట్ ఔట్ పుట్ రాబ‌ట్ట‌డానికి అవ‌కాశం దొరుకుతుంది అంటూ షూట్ విష‌యంలో ఫిలిం మేక‌ర్స్ అనుస‌రించ‌ద‌గ్గ ప‌ద్ధ‌తిని వివ‌రించాడు జ‌క్క‌న్న‌.

Related Post

Report: Tammannah’s erotic thriller Ragini MMS 3 stalled with director getting oustedReport: Tammannah’s erotic thriller Ragini MMS 3 stalled with director getting ousted

The third installment of the erotic horror thriller franchise, Ragini MMS 3, featuring Tamannaah Bhatia, has reportedly witnessed a setback even before going on floors. According to an exclusive report