hyderabadupdates.com movies రాజమౌళికి దారివ్వబోతున్న రవితేజ?

రాజమౌళికి దారివ్వబోతున్న రవితేజ?

మాస్ మహారాజా కొత్త సినిమా ‘మాస్ జాతర’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరికి అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలని నిర్ణయించారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడడంపై తమ మీద తామే సెటైర్లు వేసుకుంటూ కొన్ని రోజుల కిందట ఒక వీడియో కూడా చేసింది ‘మాస్ జాతర’ టీం. ఆ సందర్భంలోనే అక్టోబరు 31న సినిమా పక్కాగా విడుదలవుతుందని నొక్కి వక్కాణించారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా సినిమా రిలీజ్ కాదట. అలా అని ఆ సినిమా ఇంకొన్ని వారాలు వెనక్కి వెళ్తుందేమో అని సందేహించాల్సిన పని లేదు. అక్టోబరు 31నే ‘మాస్ జాతర’ షోలు పడనున్నాయి. కానీ అధికారిక రిలీజ్ మాత్రం నవంబరు 1న అని సమాచారం. 31న ఈ చిత్రానికి పరిమిత సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నారు. తర్వాతి రోజు సినిమా పూర్తి స్థాయిలో విడుదలవుతుంది.

రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న రీ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’లను కలిపి ఒక సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మాస్ జాతర’ను ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మామూలుగా అయితే రీ రిలీజ్‌లకు ఇలాంటి మిడ్ రేంజ్ సినిమాలు దారి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి అండ్ కో అందరి మీదా రవితేజ సహా మాస్ జాతర టీంలో అందరికీ గౌరవ భావం ఉంది.

‘బాహుబలి’ అంటే తెలుగు సినిమాకు ఒక ప్రైడ్‌లాగా ఫీలవుతారు అందరూ. పైగా రాజమౌళి స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి రెండు భాగాలను కలిపి ఒకటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆడియన్స్‌లో కూడా సినిమా పట్ల అమితాసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 31వ తేదీని ‘బాహుబలి’కి వదిలేసి తర్వాతి రోజు ‘మాస్ జాతర’ను రిలీజ్ చేయబోతున్నారు.

Related Post

భాగ్య‌శ్రీ… అప్పుడే మొద‌లుపెట్టేసిందేభాగ్య‌శ్రీ… అప్పుడే మొద‌లుపెట్టేసిందే

గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబ‌యి భామ భాగ్య‌శ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో భలే హైలైట్ అయింది భాగ్యశ్రీ. సినిమా విడుదల కావడానికి ముందే ఆమెకు మంచి హైప్ కూడా వచ్చింది. అవ‌కాశాలు వ‌రుస

శభాష్ అక్షయ్… ఇది అసలైన హీరోయిజంశభాష్ అక్షయ్… ఇది అసలైన హీరోయిజం

సెలబ్రిటీలు, స్టార్లు తమ వ్యక్తిగత విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అది సమాజానికి అంతో ఇంతో మంచి చేసేదే అయినా ఎందుకొచ్చిన గొడవలెమ్మని మౌనంగా ఉంటారు. పరిస్థితులు అవే మారతాయని సర్దిచెప్పుకుని నయవంచన చేసుకునే వాళ్లకు కొదవ లేదు. కానీ అక్షయ్