hyderabadupdates.com movies రాజమౌళిని ఫాలో అవ్వండయ్యా

రాజమౌళిని ఫాలో అవ్వండయ్యా

మామూలుగా తన కొత్త సినిమాను మొదలుపెట్టే ముందే దాని విశేషాలను అధికారికంగా మీడియాతో, అభిమానులతో పంచుకోవడం రాజమౌళికి అలవాటు. సినిమా ప్రారంభోత్సవం రోజే ‘ఈగ’ కథ చెప్పడం.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ ఆరంభ దశలో ఉండగానే ఆ సినిమా కాన్సెప్ట్ గురించి ఓపెన్ చేసేయడం రాజమౌళికే చెల్లింది. కానీ మహేష్ బాబుతో కొత్త సినిమా విషయంలో మాత్రం ఆయన ఎక్కడ లేని గోప్యత పాటించారు. చిత్రీకరణ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించలేదు. కొన్ని నెలల తర్వాత కూడా ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. 

మహేష్ పుట్టిన రోజుకు కూడా ఏ చిన్న విశేషాన్నీ పంచుకోలేదు. నవంబరులో ట్రీట్ ఉంటుందని మాత్రమే చెప్పాడు జక్కన్న. ఐతే ఈ నెలలో జస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే లాంచ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చడీచప్పుడు లేకుండా వరుస అప్‌డేట్లతో షాకిస్తోంది రాజమౌళి టీం. ఇప్పటికే విలన్ పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వదిలారు. దానికే ఆశ్చర్యపోతుంటే.. ‘సంచారీ..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.

ఒక పెద్ద సినిమా నుంచి పాటను లాంచ్ చేయడమంటే ఈ రోజుల్లో పెద్ద ప్రహసనంగా మారుతోంది. ముందు రేపు ఒక అప్‌డేట్ ఇవ్వబోతున్నాం అంటారు. తర్వాత పాట గ్లింప్స్ ఏ రోజు రిలీజ్ చేయబోతున్నామో చెప్తారు. ఆ గ్లింప్స్‌లో పూర్తి పాట ఉండదు. ఒక అరనిమిషం పాట చూపించి.. ఫుల్ సాంగ్ ఫలానా రోజు అని మళ్లీ ఒక టైమింగ్ ఇస్తారు. ఇలా అప్‌గేట్స్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ సోషల్ మీడియా జనాలను తీవ్ర అసహనానికి గురి చేయడం ఈ మధ్య రివాజుగా మారింది. రాను రాను ఈ వ్యవహారం అభిమానుల్లో ఫ్రస్టేషన్‌ను పెంచేస్తోంది. 

కానీ మహేష్-రాజమౌళి సినిమా టీం మాత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా చిన్న హింట్ కూడా ఇవ్వకుండా నేరుగా పాటను లాంచ్ చేయడం అందరికీ పెద్ద షాకే. పైగా ఈ పాటను శ్రుతి హాసన్ ఆలపించడం ఇంకా పెద్ద సర్ప్రైజ్. సినిమా థీమ్‌ను చాటిచెప్పేలా సాగిన ఈ పాట బాగానే ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద సినిమా నుంచి, హడావుడి లేకుండా.. ఈ దశలో ఇలా ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడం విశేషమే. ఒక పాట గురించి వారాలు, నెలల తరబడి ఊరించి.. అప్‌డేట్లకు అప్‌డేట్లు ఇస్తూ ఫ్రస్టేట్ చేయడం మాని.. రాజమౌళి లాగే నేరుగా పాటలు రిలీజ్ చేసే సంస్కృతి రావాలనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

Related Post

Ravi Babu’s ‘Razor’ Title Glimpse Highlights Raw BrutalityRavi Babu’s ‘Razor’ Title Glimpse Highlights Raw Brutality

Filmmaker-actor Ravi Babu returns with a strikingly intense new project titled Razor, marking a sharp shift from his recent lighthearted outing Enuguthondam Ghatikachalam. This time, Ravi Babu steps into dark,