హైదరాబాద్ : మన శంకర వర ప్రసాద్ మూవీ నిర్మాత, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిదల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. అదే పనిగా ఫ్యాషన్ ట్రెండ్‌లను గుడ్డిగా అనుసరించే వ్యక్తి కాదని పేర్కొంది. ఆర్ ఆర్ఆర్ మూవీ హీరో తన వ్యక్తిగత శైలి గురించి చాలా స్పష్టంగా ఉంటారని , ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉన్న వాటి కంటే తన శరీర ఆకృతికి సరిపోయే దుస్తులనే ఇష్టపడతారని ఆమె పంచుకున్నారు. సుస్మిత కొణిదల ప్రకారం రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేసింది.
తాను ధరించే దుస్తుల విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారని తెలిపింది సుష్మిత కొణిదల. తనకు బాగా సరిపోయే దుస్తులను ఎంచుకోవడానికి సమయం తీసుకుంటారని పేర్కొంది. తెరపై అయినా, తెర వెనుక అయినా, అతని సహజమైన హుందాతనం, ఆత్మ విశ్వాసం ఏ దుస్తులనైనా సులభంగా ధరించడానికి వీలు కల్పిస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా మన శంకర వర ప్రసాద్ మూవీతో తొలిసారిగా నిర్మాతగా మారారు. ఇందులో తన తండ్రి ప్రముఖ నటుడు చిరంజీవిని హీరోగా పెట్టి తీసింది. ఇది ఊహించని రీతిలో ఏకంగా వారం రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. రికార్డుల మోత మోగించింది. ఈ మూవీలో చిరంజీవి ధరించిన దుస్తులు సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి.
The post రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెషల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెషల్
Categories: